ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూలివాలా మీట్‌

ABN, First Publish Date - 2017-12-02T16:56:54+05:30

మటన్‌-కిలో, సోంపు-ఒక టేబుల్‌స్పూను, జీలకర్ర, ధనియాలు-ఒక్కో టీస్పూను చొప్పున, ఆవనూనె-అరకప్పు, ఇంగువ-చిటికెడు, పసుపు, శొంఠిపొడి- ఒక్కో టీస్పూను చొప్పున

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: మటన్‌-కిలో, సోంపు-ఒక టేబుల్‌స్పూను, జీలకర్ర, ధనియాలు-ఒక్కో టీస్పూను చొప్పున, ఆవనూనె-అరకప్పు, ఇంగువ-చిటికెడు, పసుపు, శొంఠిపొడి- ఒక్కో టీస్పూను చొప్పున, కారం- రెండు టీస్పూన్లు, ముల్లంగి (తురుము)-2, ఉప్పు-తగినంత, నీళ్లు-రెండు కప్పులు, గ్రీన్‌ యాలకులు-నాలుగు, బ్రౌన్‌ యాలకులు-రెండు, దాల్చినచెక్క ముక్కలు చిన్నవి - రెండు, లవంగాలు-ఎనిమిది, మిరియాలు-8.
 
తయారీ:
  • కుక్కర్‌లో మటన్‌, మసాలాలు వేసి, నీళ్లను పోసి 20 నిమిషాలు ఉడికించాలి.
  • పాన్‌లో సోంపు, జీలకర్ర, ధనియాలు వేసి నూనె లేకుండా వేగించాలి. చల్లారాక మిక్సీలో వేసి పొడి చేయాలి.
  • లోతు ఎక్కువగా ఉన్న కళాయిలో ఆవనూనె వేడిచేయాలి. ఇంగువ పొడిని కొన్ని నీళ్లలో వేసి కలపాలి. ఆ నీటిని నూనెలో పోయాలి.
  • కొన్ని నీళ్లు తీసుకుని ఉప్పు, శొంఠి, పసుపు, కారం వేసి ఉండలు కట్టకుండా కలిపి కళాయిలోని నూనెలో పోయాలి.
  • వండడానికి ఉపయోగించిన మసాలాతోపాటు నూరిన తాజా మసాలాను కూడా నూనెలో కలిపి ఉండచుట్టకుండా నిమిషంపాటు గరిటెతో కలపాలి. తర్వాత ఉడకబెట్టిన మటన్‌ను అందులో కలపాలి. చివరిగా ముల్లంగి తురుము, తగినంత ఉప్పు వేయాలి.
  • తర్వాత మూతపెట్టి సన్నని మంటపై మటన్‌ మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి.
  • మూలీవాలా మీట్‌ రెడీ. దీన్ని వేడి వేడి అన్నంతో తింటే బాగుంటుంది.

Updated Date - 2017-12-02T16:56:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising