ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షాహి పసంద

ABN, First Publish Date - 2017-12-02T16:55:33+05:30

డక్‌ (బాతు)బ్రెస్ట్‌- అరకిలో, ఎర్ర ఉల్లిపాయలు, నువ్వులు - ఒక్కోటి 100 గ్రాముల చొప్పున, జీడిపప్పు- 150 గ్రాములు, పుదీనా- ఒక కట్ట, పెరుగు- 250 గ్రాములు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: డక్‌ (బాతు)బ్రెస్ట్‌- అరకిలో, ఎర్ర ఉల్లిపాయలు, నువ్వులు - ఒక్కోటి 100 గ్రాముల చొప్పున, జీడిపప్పు- 150 గ్రాములు, పుదీనా- ఒక కట్ట, పెరుగు- 250 గ్రాములు, దేశీయ నెయ్యి- 300 గ్రాములు, అల్లం, వెల్లులి పేస్టు- ఒక్కో టేబుల్‌స్పూను చొప్పున, తెల్ల మిరియాలు, శొంఠి, గరంమసాలా పొడి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి(కచ్చాపచ్చాగా చేసి)- ఒక్కో టీస్పూను చొప్పున, ఉప్పు-తగినంత, టొమాటోలు (సన్నగా తరిగి) -3, ఉల్లిగింజలు- ఒక టీస్పూను, క్రీమ్‌ చీజ్‌- అరకప్పు.
అలంకరణకు: పైన్‌ గింజలు - 100 గ్రాములు
 
తయారీ:
  • డక్‌ బ్రెస్టును ముక్కలుగా కోయాలి.
  • ఉల్లిపాయలు, జీడిపప్పు, పుదీనా, నువ్వులను ఉడికించి చల్లారిన తర్వాత పెరుగుతో కలిపి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.
  • కళాయిలో నెయ్యి వేడిచేయాలి. అందులో అల్లం, వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయే వరకు వేగించి, మిగతా మసాలాను కూడా కలపాలి.
  • టొమాటోలు, పెరుగు కలిపి పేస్టులా చేయాలి.
  • వీటన్నింటితోపాటు డక్‌ బ్రెస్ట్‌ ముక్కలను కూడా కళాయిలో వేసి ఆవిరి మీద పావుగంట ఉడికించాలి.
  • చివరిగా చీజ్‌ క్రీమును కూడా అందులో వేయాలి. ఇది వేశాక మరీ ఎక్కువసేపు స్టవ్‌ మీద ఉంచకుండా దించేయాలి.
  • డక్‌ బ్రెస్ట్‌తో తయారైన షాహి పసంద మీద పైన్‌ గింజలు చల్లి రోటీతో తింటే ఎంతో బాగుంటుంది.

Updated Date - 2017-12-02T16:55:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising