ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉసిరి, సొరకాయ, తేనె షాట్‌

ABN, First Publish Date - 2017-11-04T13:37:20+05:30

ఉసిరికాయలు- నాలుగు(ముక్కలు, తురుముగా చేసి), కచ్చాపచ్చాగా చేసిన ఉసిరి-నాలుగు టీస్పూన్లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
ఉసిరికాయలు- నాలుగు(ముక్కలు, తురుముగా చేసి), కచ్చాపచ్చాగా చేసిన ఉసిరి-నాలుగు టీస్పూన్లు, తొక్కతీసిన సొరకాయముక్కలు- ఒక కప్పు, తేనె- మూడు టేబుల్‌స్పూన్లు, సోంపు పొడి-పావు టీస్పూను, అలంకరణకు-నిమ్మ ముక్కలు, కచ్చాపచ్చాగా చేసిన ఐస్‌ముక్కలు-4 టేబుల్‌స్పూన్లు.
 
తయారీ
ఉసిరికాయల్లోని గింజలు తీసేసి వాటిని చిన్న ముక్కలుగా తరగాలి. వీటిని బ్లెండర్‌లో వేయాలి. సొరకాయపై ఉండే తొక్కు తీసి ముక్కలుగా తరిగి సొరకాయముక్కల్ని బ్లెండర్‌లో వేయాలి. అనంతరం సోంపుపొడి, తేనె, కచ్చాపచ్చాగా చేసిన ఉసిరిముక్కల్ని కూడా బ్లెండర్‌లో వేసి ప్యూరీలా చేయాలి. ఈ ప్యూరీని వడగట్టి జ్యూసులా తీయాలి. తర్వాత చిన్న గాజుగ్లాసును సగంమేర ఐస్‌ముక్కలతో నింపి వడగట్టిన ఉసిరి, సొరకాయ జ్యూసును అందులో పోయాలి. గుండ్రంగా తరిగిన సన్నని నిమ్మకాయ ముక్కను జ్యూసుపై అలంకరించి కూల్‌ కూల్‌ జ్యూసును అతిథులకు అందించండి.

Updated Date - 2017-11-04T13:37:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising