ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాప్లీ కబాబ్‌

ABN, First Publish Date - 2017-10-21T22:43:28+05:30

మటన్‌ ఖీమా 800 గ్రాములు, అల్లం 15 గ్రాములు, ఉల్లిపాయలు 50 గ్రాములు, పుదీనా 10 గ్రాములు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావాల్సిన పదార్థాలు
మటన్‌ ఖీమా 800 గ్రాములు, అల్లం 15 గ్రాములు, ఉల్లిపాయలు 50 గ్రాములు, పుదీనా 10 గ్రాములు, కొత్తిమీర 20 గ్రాములు, పచ్చిమిరపకాయలు 10గ్రాములు, వెల్లుల్లిపాయలు 15 గ్రాములు, జీలకర్ర 5 గ్రాములు, నల్ల ఉప్పు రుచి కోసం తగినంత
రెడ్‌ చిల్లీ పేస్ట్‌ 25 గ్రాములు, జీరకర్ర పొడి 20 గ్రాములు, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టేబుల్‌ స్పూన్‌, కస్తూరీ మేతీ పౌడర్‌ అర టీ స్పూన్‌, నూనె 10 మిల్లీలీటర్లు.
 
తయారీ విధానం
డీప్‌ ట్రేలో మటన్‌ ఖీమా తీసుకోవాలి. దానికి జీలకర్ర, అల్లం, రెడ్‌ చిల్లీ పేస్ట్‌, ఉప్పు, బ్లాక్‌సాల్ట్‌, గరం మసాలా, కస్తూరీ మేతీ పౌడర్‌, ఆయిల్‌ కలపాలి. చేతితో వీటన్నిటినీ బాగా కలిపి ఓ అరగంట నాననివ్వాలి. తరువాత ఈ మిక్స్‌లోనే తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, నెయ్యి, కొత్తిమీర, పుదీనా కలపాలి. దాన్ని సమాన భాగాలుగా విడదీసి ఉండలుగా చేసుకోవాలి. చేతికి నూనె రాసుకుని ఈ బాల్స్‌ను గుండ్రటి పట్టీలుగా చేసుకోవాలి. తరువాత పాన్‌పై కొద్దిగా నెయ్యి లేదంటే నూనె వేసి సన్నటి మంటపై వాటిని గోధుమ రంగు వచ్చేవరకూ ఫ్రై చేస్తే హాట్‌ హాట్‌ కబాబ్‌ రెడీ! వేడిగా సలాడ్‌, చట్నీతో సర్వ్‌ చేసుకుంటే బాగుంటుంది.

Updated Date - 2017-10-21T22:43:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising