ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింగపూర్ నూడిల్స్

ABN, First Publish Date - 2017-03-18T21:45:50+05:30

నూడుల్స్‌- 2 కప్పులు, ఉల్లిపాయ- 1, మిరియాలు- పావు టీ స్పూను, బఠాణీలు-1 టేబుల్‌ స్పూను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
నూడుల్స్‌- 2 కప్పులు, ఉల్లిపాయ- 1, మిరియాలు- పావు టీ స్పూను, బఠాణీలు- 1 టేబుల్‌ స్పూను, చిక్కుడుకాయలు- పది (కత్తిరించకుండా అలాగే వేయాలి), సోయాసాస్‌- ఒక టేబుల్‌ స్పూను, కర్రీపౌడర్‌- 3 టీ స్పూన్లు, కొకొనట్‌ షుగర్‌ (మార్కెట్లో దొరుకుతుంది)- ఒక టేబుల్‌ స్పూను, నిమ్మరసం, నూనె- 2 టేబుల్‌ స్పూన్లు, వెల్లుల్లి ముద్ద- 2 టీ స్పూన్లు, పనీర్‌ ముక్కలు- అర కప్పు, తరిగిన క్యాప్సికమ్‌ (ఎర్రది)- ఒకటి, ఉల్లికాడలు- కొద్దిగా, ఉప్పు, కారం- తగినంత.
 
తయారీ విధానం
 
నూడుల్స్‌ను వేడినీటిలో వేసి రెండు నిమిషాల తర్వాత తీసి ఆరబెట్టాలి. ఒక గిన్నెలో సోయాసాస్‌, వెల్లుల్లి ముద్ద, కొకొనట్‌ షుగర్‌, నిమ్మరసం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాణలిలో ఒక టేబుల్‌ స్పూను నూనె పోసి వేడెక్కాక మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్‌ ముక్కలు వేసి వేగించాలి. తర్వాత బఠాణీలు, సోయాసాస్‌ మిశ్రమం, సగం కర్రీపౌడర్‌ కూడా వేసి రెండు నిమిషాలు వేగించి దించి పక్కన పెట్టుకోవాలి. మరో బాణలిలో ఒక టేబుల్‌ స్పూను నూనె పోసి వేడెక్కాక నూడుల్స్‌ వేసి మిగిలిన సగం కర్రీపౌడర్‌ వేసి నిమిషం పాటు వేగించాలి. తర్వాత పనీర్‌ ముక్కలు, చిక్కుడు కాయలు, మిగిలిన పదార్థాలన్నిటినీ వేసి మరో 5 నిమిషాలు వేగించి దించేయాలి.

Updated Date - 2017-03-18T21:45:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising