ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోరు చిక్కడు పకోడీలు

ABN, First Publish Date - 2017-10-28T23:56:48+05:30

గోరుచిక్కుడు తరుగు - ఒక కప్పు, ఉల్లి తరుగు - అరకప్పు, శనగపిండి - ముప్పావు కప్పు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
గోరుచిక్కుడు తరుగు - ఒక కప్పు, ఉల్లి తరుగు - అరకప్పు, శనగపిండి - ముప్పావు కప్పు, బియ్యప్పిండి - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, పచ్చిమిర్చి - 2, అల్లంవెల్లుల్లి పేస్టు - అర టీ స్పూను, జీలకర్ర - పావు టీ స్పూను, కొత్తిమీర తరుగు - అర కప్పు, నూనె - వేగించడానికి సరిపడా.
 
తయారుచేసే విధానం
 
గోరుచిక్కుడు తరుగు ముప్పావు వంతు ఉడికించి నీరు వడకట్టాలి. ఒక లోతైన గిన్నెలో ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, అల్లంవెల్లుల్లి పేస్టు, ఉప్పు, బియ్యప్పిండి, జీలకర్ర, ఉడికించిన గోరుచిక్కుడు తరుగు వేసి ఆ తర్వాత కొద్దికొద్దిగా శనగపిండి వేస్తూ ముద్దలా చేసుకోవాలి. అవసరం అనుకుంటే నీరు చల్లుకోవచ్చు. బాణలిలో నూనె వేడెక్కిన తర్వాత పిండిమిశ్రమాన్ని చేత్తో కొంత కొంత తీసుకుని పకోడీలుగా వేసి దోరగా వేగించాలి. ఇవి సాయంత్రం స్నాక్స్‌గా లేదా, సాంబారన్నంతో సైడ్‌ డిష్‌గా బాగుంటాయి.

Updated Date - 2017-10-28T23:56:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising