ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాన్‌ పత్తా బిరియాని

ABN, First Publish Date - 2016-02-03T16:35:49+05:30

కావలసిన పదార్థాలు: రొయ్యలు - 400గ్రా, పొల్లిచ మసాలా - 400గ్రా, వండిన పులావ్‌ రైస్‌ - 800గ్రా, అరటి ఆకులు - 4, టైగర్‌ రొయ్యలు - 400గ్రా, కారం - 10గ్రా, పసుపు -

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: రొయ్యలు - 400గ్రా, పొల్లిచ మసాలా - 400గ్రా, వండిన పులావ్‌ రైస్‌ - 800గ్రా, అరటి ఆకులు - 4, టైగర్‌ రొయ్యలు - 400గ్రా, కారం - 10గ్రా, పసుపు - 5గ్రా  ఉప్పు - 10గ్రా, నిమ్మరసం - 3 నిమ్మకాయలు, కరివేపాకు - 5గ్రా, ఉల్లి తరుగు - 80గ్రా, పికిల్‌ - 40గ్రా, అప్పడాలు - 4, పొల్లిచ మసాలా: కొబ్బరి నూనె - 100గ్రా, ఆవాలు - 10గ్రా మెంతులు - 5గ్రా, వెల్లుల్లి తరుగు - 25గ్రా, అల్లం తరుగు - 20గ్రా, పచ్చిమిర్చి - 10గ్రా ,కరివేపాకు - 5గ్రా, ఉల్లి ముక్కలు - 1 కిలో ,టొమాటో పేస్ట్‌ - 400గ్రా, ఉప్పు - 10గ్రా కుంకుమ పువ్వు - 15గ్రా, పసుపు - 5గ్రా, కశ్మీరీ కారం - 15గ్రా, ధనియాల పొడి - 20గ్రా, ఫిష్‌ స్టాక్‌ - 150గ్రా

తయారీ విధానం: నూనె వేడిచేసి ఆవాలు, అల్లం, వెల్లుల్లి తరుగు, కారం, కరివేపాకు, ఉల్లి ముక్కలు వేసి ఎర్రగా వేగించాలి. తర్వాత మసాలాలు వేసి టొమాటో పేస్ట్‌, ఫిష్‌ స్టాక్‌ కూడా వేసి కలపాలి. నూనె తేలేవరకూ ఉడికించి ఉప్పు, కుంకుమ పువ్వు వేసి దింపాలి. చిన్న రొయ్యలకు పొల్లిచ మసాలా కలిపి పక్కనుంచాలి. కారం, పసుపు, ఉప్పు, తరిగిన కరివేపాకు, నిమ్మరసంలో టైగర్‌ ప్రాన్స్‌ను నానబెట్టుకోవాలి. అరటి ఆకులో ముందుగా కలిపి పెట్టుకున్న చిన్న రొయ్యలు, వాటిపైన ముందుగా తయారు చేసి పెట్టుకున్న పులావ్‌, టైగర్‌ ప్రాన్స్‌ లేయర్స్‌గా పరచాలి. తర్వాత అరటి ఆకును నాలుగువైపుల్నుంచీ మడిచి గ్రిల్‌ మీద కాల్చాలి. అరటి ఆకు నల్లగా తయారై ఆకు వాసన రొయ్యలకు పట్టేంతవరకూ గ్రిల్‌ చేయాలి. పికిల్‌, అప్పడాలతో వేడివేడిగా తినేయాలి.

Updated Date - 2016-02-03T16:35:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising