ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లుక్మి

ABN, First Publish Date - 2016-07-30T17:28:44+05:30

కావలసిన పదార్థాలు : మైదా - రెండు కప్పులు, ఉప్పు - అర టీస్పూన్‌, నెయ్యి - నాలుగు టేబుల్‌స్పూన్‌లు, తాజా పెరుగు - పావు కప్పు, గోరు వెచ్చని నీళ్లు - కొన్ని నూనె - వేగించడానికి సరిపడా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు : మైదా - రెండు కప్పులు, ఉప్పు - అర టీస్పూన్‌, నెయ్యి - నాలుగు టేబుల్‌స్పూన్‌లు, తాజా పెరుగు - పావు కప్పు, గోరు వెచ్చని నీళ్లు - కొన్ని నూనె - వేగించడానికి సరిపడా.

స్టఫ్‌ కోసం : చికెన్‌(చిన్నముక్కలు) - పావుకేజీ, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - ఒక టీస్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి(సన్నగా తరిగి), కారం - ఒక టేబుల్‌స్పూన్‌, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా - ఒక్కో టీ స్పూన్‌ చొప్పున, కొత్తిమీర - కొద్దిగా(సన్నగా తరిగి), నెయ్యి - రెండు టేబుల్‌ స్పూన్‌లు.

తయారీ :
చికెన్‌లో అల్లం వెల్ల్లుల్లి పేస్టు, ఉప్పు వేసి ఉడికించాలి. పాన్‌లో నెయ్యి వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేవరకు వేగించాలి. తరువాత ఉడికించిన చికెన్‌ వేసి పసుపు, కారం, ధనియాల పొడి వేసి పొడిగా అయ్యేవరకు వేగించాలి. తరువాత గరంమసాలా, కొత్తిమీర వేసి పాన్‌ పక్కన పెట్టాలి. మైదా పిండిలో ఉప్పు కలిపి జల్లించాలి. బ్రెడ్‌ పొడిలా అయ్యేవరకు ఈ మిశ్రమంలో నెయ్యి వేసి రెండు అరచేతులతో రుద్దాలి. తరువాత పెరుగు, గోరువెచ్చని నీళ్లు పోసి మెత్తటి ముద్దలా కలపాలి. చేతికి అతుక్కోకుండా ఈ ముద్ద ఉండాలి. కలిపి పెట్టుకున్న మైదా ముద్దని చిన్నచిన్న ఉండలు చేయాలి. ఒక్కో ఉండను పలుచటి చపాతీలా వత్తాలి. వాటిలో ఒక్కో చపాతీ మధ్యలో వేగించిన చికెన్‌ మిశ్రమాన్ని ఉంచాలి. మరో చపాతీతో చికెన్‌ ఉంచిన చపాతీని కప్పేయాలి. గట్టిగా చివర్లను వత్తి అతికించాలి. వీటిని స్క్వేర్స్‌గా కోసి ఓ మాదిరి మంట మీద బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. పేపర్‌ టవల్‌ మీద వేస్తే అది నూనె పీల్చేస్తుంది. వీటిని టొమాటో సాస్‌తో తింటే చాలా బాగుంటాయి.

Updated Date - 2016-07-30T17:28:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising