ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాలు ఒబ్బట్టు

ABN, First Publish Date - 2016-01-13T15:45:57+05:30

కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, పాలు- ఒకటిన్నర కప్పు, మైదాపిండి- అరకప్పు, నెయ్యి- రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు- చిటికెడు, గసగసాలు- రెండు టేబుల్‌స్పూన్లు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, పాలు- ఒకటిన్నర కప్పు, మైదాపిండి- అరకప్పు, నెయ్యి- రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు- చిటికెడు, గసగసాలు- రెండు టేబుల్‌స్పూన్లు, కిస్‌మిస్‌, జీడిపప్పు, బాదం పప్పు- ఒక్కో టేబుల్‌స్పూను చొప్పున, పచ్చి కొబ్బరి తురుము- ఒక కప్పు, ఎండుకొబ్బరి తురుము- ఒకటేబుల్‌స్పూను, యాలకలు- నాలుగు, బెల్లంపొడి- ముప్పావు కప్పు, నూనె- తగినంత
తయారీ విధానం: ఒక గిన్నెలో గోధుమపిండి, మైదా, ఉప్పు, కొద్దిగా నెయ్యి తీసుకొని నీళ్లు పోస్తూ పూరీ పిండిలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఇరవై నిమిషాలపాటు నాననివ్వాలి. తరువాత ఉండలు చేసి పూరీల్లా వత్తాలి. వీటిని నూనెలో డీప్‌ప్రై చేయాలి. పాన్‌లో గసగసలాను గోధుమరంగులోకి వచ్చే వరకు వేగించాలి. చల్లారిన గసగసాలు, కొబ్బరి తురుము, బాదం, యాలకలను కలిపి పొడి చేసి కొద్దిగా నీళ్లు పోసి గుజ్జులా చేసుకోవాలి. పాన్‌లో ఒక కప్పు నీళ్లు పోసి బెల్లం వేసి అది కరిగేవరకు వేడి చేయాలి. తరువాత దీనిలో గసగసాల మిశ్రమం, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలపాలి. కొద్దిసేపటి తరువాత పాలుపోయాలి. ఈ మిశ్రమాన్ని సన్నటిమంటపై పదినిమిషాలపాటు ఉడికించాలి. వేగించిన జీడిపప్పు, కిస్‌మిస్‌లు వేసిన ఈ పాయసాన్ని పూరీలపై పోసి సర్వ్‌ చేయాలి. ఇది కర్నాటక వారు సంక్రాంతికి వండుకునే ప్రత్యేక వంటకం.

Updated Date - 2016-01-13T15:45:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising