ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొబ్బరి బొబ్బట్లు

ABN, First Publish Date - 2016-08-27T18:38:22+05:30

కొబ్బరికాయలు - 2, మైదా - అర కేజి, బెల్లం లేదా పంచదార - పావుకేజి, యాలకులు - 3, నూనె లేదా నెయ్యి - 100 గ్రా, గసగసాలు - 100 గ్రా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కావలసిన పదార్ధాలు: కొబ్బరికాయలు - 2, మైదా - అర కేజి, బెల్లం లేదా పంచదార - పావుకేజి, యాలకులు - 3, నూనె లేదా నెయ్యి - 100 గ్రా, గసగసాలు - 100 గ్రా.

 
తయారీ విధానం: ముందుగా మైదాపిండిలో నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలిపి రెండు గంటలు నాననివ్వాలి. తరువాత కొబ్బరి, బెల్లం తురుముకొని, రెండింటినీ ఒక గిన్నెలో వేసి ఉడికించాలి. కొబ్బరి, బెల్లం ఉడికి ముద్దలా అయి తీగపాకం వచ్చాక దించాలి. తర్వాత బాగా మెదిపి యాలకుల పొడి, దోరగా వేయించిన గసగసాలు వేయాలి. ఇప్పుడు ఈ కొబ్బరి ముద్దను నిమ్మకాయ సైజులో ముద్దలుగా చేసుకోవాలి. నానబెట్టిన మైదాపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, ఒక్కోదాన్ని చిన్న పూరీలా ఒత్తి, అందులో కొబ్బరి ముద్ద పెట్టి పూరీతో చుట్టేసి చేత్తో లేదా అప్పడాల కర్రతో సున్నితంగా వత్తాలి. వీటిని బొబ్బట్ల మాదిరిగానే పెనం మీద నెయ్యి లేదా నూనె వేసి రెండు వైపులా దోరగా కాల్చాలి. అంతే కొబ్బరి బొబ్బట్లు రెడీ.

Updated Date - 2016-08-27T18:38:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising