ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పన్నీర్‌ కుల్చా

ABN, First Publish Date - 2016-08-03T16:09:06+05:30

కావలసిన పదార్ధాలు: మైదా - రెండు కప్పులు, పాలు - అరకప్పు, పెరుగు - పావుకప్పు, పంచదార - అర టీ స్పూను, బేకింగ్‌ పౌడర్‌ - ముప్పావు టీ స్పూన, నువ్వులు - మూడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్ధాలు: మైదా - రెండు కప్పులు, పాలు - అరకప్పు, పెరుగు - పావుకప్పు, పంచదార - అర టీ స్పూను, బేకింగ్‌ పౌడర్‌ - ముప్పావు టీ స్పూన, నువ్వులు - మూడు టీ స్పూన్లు, నెయ్యి - రెండు స్పూన్లు, తురిమిన పన్నీర్‌ - పావుకప్పు, ఉల్లిగడ్డ - ఒకటి, పచ్చిమిరపకాయలు - రెండు, చాట్‌మసాలా - ఒక టీ స్పూన, కారం - ఒక టీ స్పూన, ఉప్పు - తగినంత.
 
తయారుచేసే పద్ధతి: పాలు వేడిచేసి చల్లార్చుకోవాలి. మైదాలో బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు వేసి కలపాలి. దీంట్లో పంచదార, చల్లని పాలు, పెరుగు వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. దీనిపై ఒక మెత్తని వస్త్రం కప్పి రెండుగంటలపాటు పక్కన పెట్టాలి. ఈలోపు పచ్చిమిరపకాయలను, ఉల్లిగడ్డను చిన్నగా కట్‌ చేసుకోవాలి. ఒక గిన్నెలో పన్నీర్‌, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కారం, చాట్‌మసాలా వేసి కలపాలి. ఇప్పుడు మైదాను తీసుకొని చిన్నచిన్న ఉండలుగా చేసి చపాతీల్లా ఒత్తుకోవాలి. దీంట్లో పన్నీరు మిశ్రమాన్ని పెట్టి మళ్ళీ చిన్న ముద్దలా చేయాలి. మళ్ళీ కొద్దిగా పిండి, నువ్వులు వేస్తూ చపాతీల్లా చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెనం పెట్టి కొద్దిగా నెయ్యి వేస్తూ సన్నని మంట మీద రెండువైపులా కాల్చుకోవాలి. వేడి వేడి పన్నీర్‌ కుల్చా రెడీ! వీటిని బఠాణీలతో చేసిన ఏ కూరతోనైనా లాగించేయొచ్చు.

Updated Date - 2016-08-03T16:09:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising