ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వీట్‌ రైస్‌ బాల్స్‌

ABN, First Publish Date - 2016-02-03T16:13:00+05:30

కావలసిన పదార్థాలు: మైదా - రెండు కప్పులు, కొబ్బరిపాలు - 1/3 క్యాన్‌ (తీపి కోసం పంచదార కలుపుకోవచ్చు), బ్రౌన్‌ షుగర్‌ - ఒక కప్పు, ఎండు కొబ్బరి తురుము -

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: మైదా - రెండు కప్పులు, కొబ్బరిపాలు - 1/3 క్యాన్‌ (తీపి కోసం పంచదార కలుపుకోవచ్చు), బ్రౌన్‌ షుగర్‌ - ఒక కప్పు, ఎండు కొబ్బరి తురుము - అరకప్పు, నూనె - అర టీస్పూన్‌, ఆకుపచ్చ ఫుడ్‌ కలర్‌-అర టీస్పూన్‌ (నచ్చిన రంగు వాడుకోవచ్చు).
తయారీ విధానం: మైదాలో కొబ్బరి పాలు కలిపి పిండి ముద్ద చేయాలి. (కొబ్బరిపాల చిక్కదనాన్ని బట్టి మరికాస్త కొబ్బరిపాలు పోయడం లేదా పిండి కలపడం వంటివి అవసరం అవుతాయి.) ఈ ముద్ద చేతికి అంటుకోకుండా గట్టిగా ఉండాలి. పిండి కలిపేటప్పుడే ఆకుపచ్చరంగు కలపాలి. పిండి బాగా కలిపాక చిన్న చిన్న ఉండలు చేయాలి. ఆ ఉండల్ని చదునుగా నొక్కి అర టీస్పూన్‌ బ్రౌన్‌ షుగర్‌ని పోసి నెమ్మదిగా చేతి వేలితో తట్టి మళ్లీ ఉండలు చేయాలి. వీటిని ఒక పళ్లెంలో పెట్టి బియ్యప్పిండిని చల్లాలి. ఒక పెద్ద గిన్నెలో నీళ్లుపోసి ఎక్కువ మంటమీద పెట్టాలి. ఉడుకుతున్న నీళ్లలో రైస్‌ బాల్స్‌ వేయాలి. నీళ్లలో వేయగానే గిన్నె అడుగుకి చేరుకుని ఆ తరువాత నెమ్మదిగా పైకి వస్తాయి. ఉండలు పైకి తేలాక మంట తగ్గించి నాలుగు నిమిషాలు అలానే ఉంచాలి. ఉండలు ఉడుకుతున్నప్పుడే కూరగాయలు కోసే బోర్డు మీద నూనె పూయాలి. చిల్లుల గరిటెతో ఉడికిన రైస్‌ బాల్స్‌ తీసి నూనె పూసిన బోర్డు మీద పెట్టాలి. ఎండుకొబ్బరి పొడిని ఒక గిన్నెలో లేదా పళ్లెంలోకి తీసుకుని అందులో ఉండల్ని దొర్లించాలి. వీటిని అలానే సర్వ్‌ చేయొచ్చు లేదా రంగురంగుల మఫిన్‌ పేపర్స్‌లో చుట్టి ఇవ్వొచ్చు. ఫ్రిజ్‌లో నిల్వ చేయొద్దు. గాలి చొరబడని డబ్బాలో పెట్టి మూతపెట్టి ఉంచాలి. తయారైన ఒక్క రోజులో తింటే బాగుంటాయి. లేదంటే గట్టిపడతాయి.

Updated Date - 2016-02-03T16:13:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising