ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టఫ్డ్‌ బ్రెడ్‌ ఆమ్లెట్‌

ABN, First Publish Date - 2016-06-14T18:57:44+05:30

వీట్‌ బ్రెడ్‌- 6 స్లైస్‌లు, గుడ్లు- 2, ఉప్పు- రుచికి సరిపడా, మిరియాలపొడి- రుచికి సరిపడా, చీజ్‌ స్లైస్‌లు- 3, నూనె- వేగించడాకి సరిపడా, వెల్లుల్లి తరుగు- 1 టీ స్పూను,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: వీట్‌ బ్రెడ్‌- 6 స్లైస్‌లు, గుడ్లు- 2, ఉప్పు- రుచికి సరిపడా, మిరియాలపొడి- రుచికి సరిపడా, చీజ్‌ స్లైస్‌లు- 3, నూనె- వేగించడాకి సరిపడా, వెల్లుల్లి తరుగు- 1 టీ స్పూను, పచ్చిమిర్చి తరుగు- 1 టీ స్పూను, ఉల్లి ముక్కలు- 1/3 కప్పు, క్యాప్సికం తరుగు- 1/3 కప్పు

 
తయారీ విధానం: ఒక బాణలిలో రెండు స్పూన్ల నూనె వేడిచేసి వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగులను వేగించాలి. తరువాత ఉల్లి ముక్కలు, క్యాప్సికం ముక్కలను కూడా వేసి వేగించి ఉప్పు వేయాలి. ఈ మిశ్రమాన్నంతటినీ ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన ఉంచాలి. ఆ తరువాత గుడ్లు పగలగొట్టి, ఒక గిన్నెలో ఆ సొన వేసి, సరిపడా ఉప్పు, మిరియాలపొడి కూడా వేసి బాగా గిలకొట్టి పక్కన ఉంచుకోవాలి. ఆ తరువాత బ్రెడ్‌ స్లైసులను కొద్ది కొద్దిగా నూనె వేస్తూ పెనం మీద కాల్చాలి. తరువాత ఒక్కో బ్రెడ్‌ స్లైస్‌ను తీసుకుని దాని మీద క్యాప్సికం మిశ్రమాన్ని ఉంచి దానిపై చీజ్‌ స్లైస్‌ పెట్టి, ఆపై మరో బ్రెడ్‌ స్లైసును ఉంచి శాండ్‌విచలు తయారుచేసుకోవాలి. ఆ తరువాత పెనాన్ని వేడిచేసి, నూనె వేసి, పెనం అంతా పరుచుకునేలా కొద్దిగా కోడిగుడ్డు మిశ్రమాన్ని పలుచగా పోయాలి. అది కాలగానే మధ్యలో బ్రెడ్‌ శాండ్‌విచను ఉంచి అన్ని వైపులనుంచీ ఆమ్లెట్‌తో దానిని కవర్‌ చేసి, జాగ్రత్తగా తిరగేసి మరో రెండు నిమిషాలు కాలాక తీయాలి. మిగతా శాండ్‌విచలను కూడా ఇదేవిధంగా చేసుకోవాలి. తరువాత వీటిని వాలుగా మధ్యకు కోసి వడ్డించాలి.

Updated Date - 2016-06-14T18:57:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising