ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుమ్మడి దప్పళం

ABN, First Publish Date - 2016-05-18T14:24:09+05:30

కావలసిన పదార్ధాలు: గుమ్మడి ముక్కలు పెద్దవిగా తరిగినవి - కప్పు, చింతపండు - పెద్ద నిమ్మకాయంత, నూనె - రెండు టీ స్పూన్లు, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూన, ఎండుమిర్చి - 10,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్ధాలు: గుమ్మడి ముక్కలు పెద్దవిగా తరిగినవి - కప్పు, చింతపండు - పెద్ద నిమ్మకాయంత, నూనె - రెండు టీ స్పూన్లు, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూన, ఎండుమిర్చి - 10, ఉల్లితరుగు - అర కప్పు, పచ్చిమిర్చి - 8, అల్లంవెల్లుల్లి ముద్ద - టీ స్పూన, ఇంగువ - చిటికెడు, పసుపు - పావు టీ స్పూన, కారం - తగినంత, ఎండుకొబ్బరి, ధనియాల ముద్ద - మూడు టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, శనగపిండి - మూడు టీ స్పూన్లు, కొత్తిమీర - కొద్దిగా, కరివేపాకు - రెండు రెమ్మలు, బెల్లం - రుచికి సరిపడా, సాంబారు పొడి - రెండు టీ స్పూన్లు. 
 
తయారీ: ముందుగా చింతపండును వేడినీటిలో వేసి నానిన తరువాత పులుసు తీసి పక్కనుంచాలి. బాణలిలో నూనె కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి చిటపటలాడించాలి. తరువాత గుమ్మడి ముక్కలు, ఉల్లితరుగు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, ఇంగువ, పసుపు ఒకదాని తరువాత ఒకటి వేస్తూ కలపాలి. మూతపెట్టి కాస్త మగ్గిన తరువాత అందులో కారం, ఉప్పు, ఎండుకొబ్బరి, ధనియాల ముద్ద వేసి ఉడుకుతుండగా, ముందుగా తయారుచేసుకున్న చింతపండు పులుసు, మరికాస్త నీరు పోసి బాగా కలపాలి. శనగపిండిలో కొద్దిగా నీరు పోసి పలుచగా కలిపి దానిని ఉడుకుతున్న పులుసులో పోస్తూ గరిటెతో కలుపుతూ కాస్త చిక్కబడిన తరువాత స్టవ్‌ మీద నుంచి దించి కొత్తిమీర, కరివేపాకులతో గార్నిష్‌ చేయాలి. దీనిని ముద్దపప్పుతో తింటే రుచిగా ఉంటుంది.

Updated Date - 2016-05-18T14:24:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising