ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాదీ శాఫ్రాన్‌ చికెన్‌

ABN, First Publish Date - 2016-07-16T17:51:01+05:30

కావలసిన పదార్థాలు: బోన్‌లెస్‌ చికెన్‌ - అర కిలో, గోరు వెచ్చని పాలు - అర కప్పు, తాజా క్రీమ్‌ - 50 గ్రా, శొంఠి పొడి - అర టీస్పూను, కుంకుమ పువ్వు - 3 చిటికెళ్లు, పచ్చిమిర్చి పేస్ట్‌ - ఒకటిన్నర టీస్పూను,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: బోన్‌లెస్‌ చికెన్‌ - అర కిలో, గోరు వెచ్చని పాలు - అర కప్పు, తాజా క్రీమ్‌ - 50 గ్రా, శొంఠి పొడి - అర టీస్పూను, కుంకుమ పువ్వు - 3 చిటికెళ్లు, పచ్చిమిర్చి పేస్ట్‌ - ఒకటిన్నర టీస్పూను, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 150 మి.లీ, నెయ్యి - 100 గ్రా, మేవా - 100 గ్రా, జీడిపప్పు పేస్ట్‌ - 100 గ్రా, బిరియాని ఆకు - 2, దాల్చిన చెక్క - 2 అంగుళాల ముక్క, యాలకులు - 2, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ - 2 టీస్పూన్లు.
 
తయారీ విధానం: పాలలో కుంకుమ పువ్వ వేసి నానబెట్టాలి గిన్నెలో నూనె వేడి చేసి యాలకులు, బిరియాని ఆకు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, పచ్చిమిర్చి పేస్ట్‌, శొంఠి పొడి వేసి కలిపి తర్వాత పాలు, మేవా, జీడిపప్పు పేస్ట్‌ వేయాలి. ఈ దినుసులన్నీ వేగి మగ్గాక చికెన్‌, ఉప్పు, కుంకుమ పాలు పోయాలి. కూర ఉడకటం మొదలయ్యాక మంట తగ్గించి చికెన్‌ ముక్కలు ఉడికేవరకూ కలుపుతూ ఉండాలి. దీన్లో క్రీమ్‌, నెయ్యి కలపాలి. కూర చిక్కబడ్డాక మంట తీసి వేడిగా వడ్డించాలి.
 
కశ్మీరీ స్పెషల్.. కశ్మీరీ రోగన్ జోష్...
 
 మటన్ ప్రియులు మెచ్చే.. పాలక్ ఘోష్
 
 
 
 
 

Updated Date - 2016-07-16T17:51:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising