ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికెన్ దో ప్యాజ్‌

ABN, First Publish Date - 2016-01-11T22:45:25+05:30

కావలసిన పదార్థాలు: చికెన్ - కేజి, ఉల్లిపాయలు - అరకేజి, పెరుగు - పావు లీటరు, కారం - 2 టీ స్పూన్లు, గరం మసాలా - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
చికెన్ - కేజి, ఉల్లిపాయలు - అరకేజి, పెరుగు - పావు లీటరు, కారం - 2 టీ స్పూన్లు, గరం మసాలా - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 1 టేబుల్‌ స్పూను, పసుపు - 1 టీ స్పూను, ధనియాల పొడి - 1 టీ స్పూను, టమోటా గుజ్జు - 2 కప్పులు, నూనె - తగినంత, గుడ్లు - 4 ఉడికించినవి.
 
తయారీ విధానం
 
ముందుగా ఒక పాన తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి. అందులో గరం మసాలా దినుసులు వేయాలి. తర్వాత మిక్సీలో పెరుగు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను పానలో వేగుతున్న హోల్‌ గరం మసాలాకు కలిపి వేయించాలి. రెండు నిమిషాల తరువాత అందులోనే అల్లంవెల్లుల్లి పేస్ట్‌, గరం మసాలా వేసి కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత టమోటా గుజ్జు వేసి మరో రెండు నిమిషాలు వేయించి, అవసరమనుకుంటే కొద్దిగా నీళ్ళు కలుపుకోవాలి. ఉడుకుతున్న గ్రేవీలో చికెన్ ను కలిపి మరో పది నిమిషాలు మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించుకోవాలి. చికెన్ మెత్తగా ఉడికిన తరువాత స్టవ్‌ ఆఫ్‌ చేసే ముందు ఉడికించిన గుడ్లను కలుపుకుని ఒక నిమిషం తర్వాత గుండ్రంగా కట్‌ చేసుకున్న ఉల్లిపాయలను కూడా అందులో వేసి ఉడికించాలి. అంతే చికెన్ దో ప్యాజ్‌ రెడీ.

Updated Date - 2016-01-11T22:45:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising