ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బఠాణీ పరోటా

ABN, First Publish Date - 2016-11-19T21:34:30+05:30

కావలసిన పదార్థాలు: పిండి ముద్ద కోసం: గోధుమపిండి - 240 గ్రా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు:
పిండి ముద్ద కోసం: గోధుమపిండి - 240 గ్రా
ఉప్పు - తగినంత, నూనె - 2 టీస్పూన్లు, నీరు - తగినంత.

స్టఫింగ్‌ కోసం: బఠాణీలు - ఒకటిన్నర కప్పు , జీలకర్ర - అర టీస్పూను
శనగపిండి - ఒక టే.స్పూను.
కొత్తిమీర తరుగు - ఒకటిన్నర టీస్పూను , పచ్చిమిర్చి తరుగు - అర టీస్పూను
గరం మసాలా - అర టీస్పూను ,ఉప్పు, నెయ్యి - తగినంత
తయారీ విధానం:గోధుమపిండికి ఉప్పు, నూనె, నీళ్లు చేర్చి ముద్దగా కలుపుకోవాలి.
ముద్దను 30 ని.లు పక్కనుంచుకోవాలి.
స్టఫింగ్‌ కోసం: బఠాణీలను కుక్కర్‌లో వేసి ఆవిరి మీద ఉడికించుకోవాలి.
ఇందుకోసం ఒక చిన్న పాన్‌లో బఠాణీలు వేసి ఒక కప్పు నీళ్లు పోసి ఈ పాన్‌ను కుక్కర్‌లో ఉంచి 3, 4 విజిల్స్‌ వచ్చేవరకూ ఉడికించాలి. తర్వాత నీరు వంపేసి చల్లారనివ్వాలి. చల్లారాక బఠాణీలను మెదిపి పక్కనుంచాలి. పాన్‌లో జీలకర్ర వేసి వేయించుకుని బఠాణీ ముద్దకు కలుపుకోవాలి. అదే పాన్‌లో శనగపిండి కూడా ఇలాగే వేయించి బఠాణీ ముద్దకు కలుపుకోవాలి. ఈ ముద్దకు పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, ఉప్పు, గరం మసాలా కూడా చేర్చి బాగా కలుపుకోవాలి. పిండిని ఉండలుగా చేసుకుని ఒక రోటీ మీద బఠాణీ ముద్దను పరుచుకుని పైన ఇంకో పరోటా ఉంచి సున్నితంగా ఒత్తుకోవాలి. పెనం మీద నూనె వేసి రెండు వైపులా పరోటాలను కాల్చుకుని
వేడిగా వడ్డించాలి.

Updated Date - 2016-11-19T21:34:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising