ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోధుమ మోమో

ABN, First Publish Date - 2016-02-01T16:35:10+05:30

కావలసిన పదార్థాలు: గోధుమ పిండి- అరకప్పు, మొక్కజొన్న పిండి- పావుకప్పు, నూనె- ఒక టేబుల్‌స్పూను, సోయా సాస్‌, ఉప్పు- ఒక్కో టీస్పూను చొప్పున,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: గోధుమ పిండి- అరకప్పు, మొక్కజొన్న పిండి- పావుకప్పు, నూనె- ఒక టేబుల్‌స్పూను, సోయా సాస్‌, ఉప్పు- ఒక్కో టీస్పూను చొప్పున, క్యాబేజీ(తరిగి)- పావుకేజి, పుట్టగొడుగులు(తరిగి)- ఎనిమిది, ఉల్లిపాయ(తరిగి), క్యాప్సికమ్‌(తరిగి)- ఒక్కోటి చొప్పున, వెనిగర్‌, వెల్లుల్లి పేస్టు- అరటీస్పూను చొప్పున.
తయారీ విధానం: ఒక గిన్నెలో గోధుమపిండి, మొక్కజొన్న పిండి, కొద్దిగా నూనె, ఉప్పు వేసి నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పావుగంటపాటు నానబెట్టాలి. ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు, వెల్లుల్లి పేస్టు వేగించాలి. ఉల్లిపాయలు వేగాక కూరగాయ ముక్కలన్నీ వేసి వేగించాలి. అవి ఉడికిన తరువాత ఉప్పు, సోయాసాస్‌ వేసి ఒక నిమిషంపాటు వేగించి స్టవ్‌ ఆపేయాలి. కలిపి ఉంచిన పిండితో చిన్న చిన్న చపాతీలు చేసి వాటిల్లో ఒక్కో టేబుల్‌స్పూను చొప్పున కూరగాయల మిశ్రమం పెట్టాలి. ఈ మిశ్రమం బయటకు పోకుండా చపాతీని మూసేయాలి. గిన్నెలో లేదా స్టీమర్‌లో నీళ్లు పోసి మరిగించాలి. ఆ ఆవిరిలో ఈ మోమోలను ఉడికించాలి. స్టీమర్‌ లేకపోతే ఇడ్లీ పాత్రలోనైనా వీటిని చేసుకోవచ్చు. ఈ గోధుమ మోమోలను వేడివేడిగా చిల్లీ సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

Updated Date - 2016-02-01T16:35:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising