ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దద్దోజనం

ABN, First Publish Date - 2016-10-09T18:13:50+05:30

బియ్యం - అరకప్పు, నీళ్లు - ఒకటిన్నర కప్పులు, పెరుగు - ఒక కప్పు, పాలు - పావు కప్పు, పచ్చిమిర్చి(సన్నగా తరిగి) - రెండు, అల్లం (సన్నగా తరిగి)- ఒకటిన్నర టీస్పూన్‌,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: బియ్యం - అరకప్పు, నీళ్లు - ఒకటిన్నర కప్పులు, పెరుగు - ఒక కప్పు, పాలు - పావు కప్పు, పచ్చిమిర్చి(సన్నగా తరిగి) - రెండు, అల్లం (సన్నగా తరిగి)- ఒకటిన్నర టీస్పూన్‌, ఆవాలు - ముప్పావు టీస్పూన్‌, పచ్చి శెనగపప్పు - ముప్పావు టీస్పూన్‌, మినపప్పు - అర టీస్పూన్‌, కరివేపాకులు - కొన్ని, ఇంగువ - చిటికెడు, నూనె - రెండు టీస్పూన్లు, ఎండుమిర్చి - రెండు.

 
తయారీ:
బియ్యం శుభ్రంగా కడిగి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి నాలుగు విజిల్స్‌ వచ్చే వరకు కుక్కర్‌లో ఉడికించాలి.
అన్నాన్ని గరిటెతో కొద్దిగా మెత్తగా చేయాలి. అన్నం గోరువెచ్చగా ఉన్నప్పుడే పాలు పోసి కలిపి చల్లారనివ్వాలి. తరువాత పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి.
పాన్‌లో నూనె వేడిచేసి ఆవాలు, పచ్చి శెనగపప్పు, మినపప్పు వేయాలి. ఆవాలు చిటపటమంటున్నప్పుడు పచ్చిమిర్చి, అల్లం, ఎండుమిర్చి, ఇంగువ వేసి కొన్ని సెకన్లు వేగించాలి.
ఈ తాలింపును పెరుగన్నంలో వేసి కలపాలి. దానిమ్మ గింజలతో అలంకరించాలి.


Updated Date - 2016-10-09T18:13:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising