ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠోళి

ABN, First Publish Date - 2016-08-17T18:07:16+05:30

శనగలు - 150 గ్రా, పచ్చిమిర్చి - 3, పచ్చిమిర్చి తరుగు - మూడు టీ స్పూన్లు, ఉల్లిపాయ - 1, ఉల్లితరుగు - అరకప్పు, ఉప్పు - తగినంత, జీలకర్ర - టీ స్పూను, నూనె - తగినంత, కరివేపాకు - నాలుగు రెమ్మలు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్ధాలు: శనగలు - 150 గ్రా, పచ్చిమిర్చి - 3, పచ్చిమిర్చి తరుగు - మూడు టీ స్పూన్లు, ఉల్లిపాయ - 1, ఉల్లితరుగు - అరకప్పు, ఉప్పు - తగినంత, జీలకర్ర - టీ స్పూను, నూనె - తగినంత, కరివేపాకు - నాలుగు రెమ్మలు, ఆవాలు - టీ స్పూను, శనగపప్పు - టీ స్పూను, మినప్పప్పు - టీ స్పూను, అల్లంముక్క - చిన్నది, అల్లం తురుము - టీ స్పూను, ఎండుమిర్చి - 6.

 
తయారీ: శనగలను ఒకరోజు రాత్రంతా నానబెట్టాలి. నానిన శనగలను శుభ్రంగా కడిగి నీరు తీసేసి మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. రుబ్బుతున్నప్పుడే అందులో జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ వేయాలి. తరువాత ఒక బాణలిలో నూనె వేసి కాగాక అందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చిమిర్చి తరుగు, అల్లం తురుము, కరివేపాకు ఒకదాని తరువాత ఒకటి వేస్తూ వేయించాలి. తరువాత ఉల్లితరుగు వేసి వేయిస్తూ, రుబ్బి ఉంచుకున్న ముద్దను వేసి అన్నీ బాగా కలిపి మూత పెట్టాలి. మంట బాగా తగ్గించాలి. మధ్యమధ్యలో కలుపుతూ కొద్దికొద్దిగా నూనె వేస్తుండాలి. (దీనికి నూనె ఎక్కువ అవసరం అవుతుంది). సుమారు అరగంట తరువాత ఈ మిశ్రమం పొడిపొడిలాడినట్లుగా అవుతుంది. అప్పుడు దింపేయాలి. ఇది అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. )ఎఫ్ఙజ

Updated Date - 2016-08-17T18:07:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising