ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎగ్‌ వెజిటెబుల్‌ ఆమ్లెట్‌

ABN, First Publish Date - 2015-09-01T17:33:09+05:30

కావలసిన పదార్థాలు: గుడ్లు - 3, ఉల్లిపాయ - 1, ఉల్లికాడ - 1, టమోటా - 1, పచ్చిమిర్చి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: గుడ్లు - 3, ఉల్లిపాయ - 1, ఉల్లికాడ - 1, టమోటా - 1, పచ్చిమిర్చి, క్యారెట్‌ తరుగు - 2 టీ స్పూన్ల చొప్పున, క్యాప్సికం, క్యాబేజి తరుగు - 1 టీ స్పూను చొప్పున, సోయ సాస్‌, గ్రీన్‌ చిల్లీ సాస్‌ - 1 టీ స్పూను చొప్పున, పసుపు - అర టీ స్పూను, మిరియాల పొడి - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 2 టీ స్పూన్లు.
తయారుచేసే విధానం : ఉల్లిపాయ, టమోటా చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఉల్లికాడ కట్‌ చేసి తెలుపు, ఆకుపచ్చలను విడిగా పెట్టుకోవాలి. ఒక పాత్రలో ఉల్లి, టమోటా, క్యారెట్‌, క్యాబేజి, క్యాప్సికం, ఉల్లికాడ (తెల్ల) తరుగు, మిరియాలపొడి వేసి బాగా కలపాలి. మరో పాత్రలో గుడ్లు, పసుపు, ఉప్పు, రెండు టేబుల్‌ స్పూన్లు నీరు, సోయ, చిల్లీ సాస్‌, మిరియాల పొడి వేసి నురగ వచ్చేలా గిలకొట్టాలి. నూనె రాసిన పెనంపై గుడ్ల మిశ్రమం పోసి దోశలా నెరిపి మంట తగ్గించాలి. ఇప్పుడు కూరగాయల తరుగు చల్లి, అర టీ స్పూను నూనె కూడా చిలకరించి మూత పెట్టాలి. తర్వాత రెండో వైపు కూడా దోరగా కాల్చుకోవాలి. ఈ ఆమ్లెట్‌ అన్నంతో నంజుకోవచ్చు లేదా స్నాక్స్‌గా తీసుకోవచ్చు.

Updated Date - 2015-09-01T17:33:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising