ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంకాయ బెల్లం కూర

ABN, First Publish Date - 2015-12-05T14:45:11+05:30

కావలసిన పదార్థాలు: వంకాయలు - అరకిలో, బెల్లం పొడి - రెండు టేబుల్‌ స్పూన్లు, అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టేబుల్‌ స్పూను, ఉల్లిపాయలు - రెండు, గరం మసాలా - అర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: వంకాయలు - అరకిలో, బెల్లం పొడి - రెండు టేబుల్‌ స్పూన్లు, అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టేబుల్‌ స్పూను, ఉల్లిపాయలు - రెండు, గరం మసాలా - అర టీ స్పూను, కారం - రెండు టీ స్పూన్లు, పసుపు - చిటికెడు, కరివేపాకు - రెండు రెబ్బలు, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: ముందుగా ఉల్లిపాయల్ని ముక్కలుగా కోసి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు వేసి మెత్తగా నూరుకోవాలి. తరువాత వంకాయల్ని శుభ్రంగా కడిగి గుత్తివంకాయల్లా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ఉల్లిపాయ ముద్ద వేసి సన్నని మంటపై వేగించాలి. బాగా వేగాక దింపేసి పక్కన పెట్టుకోవాలి. గుజ్జు బాగా చల్లారాక దీన్ని వంకాయల్లో పెట్టుకోవాలి. మళ్లీ స్టౌ వెలిగించి వెడల్పాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ఉల్లిగుజ్జు పెట్టుకున్న వంకాయల్ని అందులో వేసి సన్నని మంటపై వేగించుకోవాలి. తరువాత ఒక కప్పు నీళ్లలో బెల్లం వేసి కలపాలి. ఈ నీళ్లు వేగుతున్న వంకాయలపై పోయాలి. నీరంతా పోయాక దించేయాలి. చివర్లో కొత్తిమీరతో అలంకరించుకోవాలి.

Updated Date - 2015-12-05T14:45:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising