ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలీఫ్లవర్‌ ఫ్రైడ్‌ రైస్‌

ABN, First Publish Date - 2015-10-27T15:20:46+05:30

కావలసిన పదార్థాలు: బాసుమతి రైస్‌: రెండు కప్పులు (వండి పెట్టుకోవాలి), కాలీఫ్లవర్‌: చిన్నది (పువ్వు విడదీసుకోవాలి). ఉల్లిపాయ: ఒకటి(ముక్కలు తరిగి పెట్టుకోవాలి), పచ్చిమిర్చి: రెండు లేదా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
 బాసుమతి రైస్‌: రెండు కప్పులు (వండి పెట్టుకోవాలి), కాలీఫ్లవర్‌: చిన్నది (పువ్వు విడదీసుకోవాలి). ఉల్లిపాయ: ఒకటి(ముక్కలు తరిగి పెట్టుకోవాలి), పచ్చిమిర్చి: రెండు లేదా మూడు(సన్నగా తరిగిపెట్టుకోవాలి), జీలకర్ర: అర టీస్పూను, కారం: అర టీస్పూను, దాల్చిన చెక్క: చిన్నది, ఉప్పు: రుచికి సరిపడ, నూనె: సరిపడ.లవంగాలు: రెండు లేదా మూడు
 
తయారీ విధానం
 
మందపాటి గిన్నె లేదా బాండీ తీసుకొని అందులో నూనె వేసి కాగిన తరువాత జీలకర్ర, దాల్చినచెక్క, లవంగాలు, పచ్చిమిరప కాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు జత చేసి దోరగా వేయించాలి. ఇప్పుడు కాలీఫ్లవర్‌ ముక్కలు, ఉప్పు వేసుకొని సన్నని మంట మీద పదినిమిషాల పాటు ఉడికించుకోవాలి. కాలీ ఫ్లవర్‌ ముక్కలు చిదిమిపోకుండా అప్పుడుప్పుడూ జాగ్రత్తగా తిప్పుతుండాలి. కాలీ ఫ్లవర్‌ ముక్కలు నూనెలో బాగా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నం జతచేసి బాగా కలపాలి. ఓ నిమిషం పాటు సన్నని మంట మీద వుంచి దింపేయాలి.
 
 

Updated Date - 2015-10-27T15:20:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising