ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేరళ క్యాబేజి

ABN, First Publish Date - 2015-09-03T17:53:08+05:30

కావలసినవి: రెండు కప్పుల కాబేజి (సన్నగా తరిగి), అర టీస్పూను ఆవాలు, ఒక టేబుల్‌స్పూను నూనె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: రెండు కప్పుల కాబేజి (సన్నగా తరిగి), అర టీస్పూను ఆవాలు, ఒక టేబుల్‌స్పూను నూనె, రెండు టేబుల్‌స్పూన్ల మినపప్పు (నానపెట్టి), రెండు టేబుల్‌స్పూన్ల తాజా కొబ్బరి (తురిమి), అర టీస్పూను మిరియాల పొడి, కరివేపాకులు 8 లేదా 10, ఒక టీస్పూను పచ్చిమిరపకాయ (తరిగి), ఒక ఎండు మిరపకాయలు (చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని), ఉప్పు తగినంత, కొత్తిమీర (సన్నగా తరిగి), టొమాటొ ముక్కలు.
ఎలా చేయాలి: పాన్‌లో నూనెను వేడిచేసి ఆవాలు, కరివేపాకులు, ఎండు మిరప ముక్కలు వేయాలి. వీటిని చిటపటమనే వరకు వేగించి మినపప్పు వేయాలి. కొన్ని నిముషాల తరువాత కాబేజి, పచ్చిమిరపకాయలు, ఉప్పు మిరియాల పొడి వేయాలి. బాగా కలిపి మూతపెట్టి సన్నని సెగమీద సగం ఉడికే వరకు ఉంచాలి. తరువాత తురిమిన కొబ్బరిని కలిపి మరికొద్దిసేపు ఉడికించాలి. ఫోటోలో చూపినట్టు క్యాబేజీ పైపొరలనే పాత్రగా మలిచి ఈ కూరను అందులో కూరి పెడితే చూడ్డానికి ఇంకా బాగుంటుంది. పైన కొత్తిమీర, టొమాటొ ముక్కలు అలంకరించి తింటే భలే రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-09-03T17:53:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising