ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుదీనా - రాజ్మా బిర్యాని

ABN, First Publish Date - 2015-09-01T18:05:35+05:30

కావలసిన పదార్థాలు : బియ్యం - కేజీ, పుదీనా - నాలుగు కట్టలు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు : బియ్యం - కేజీ, పుదీనా - నాలుగు కట్టలు, రాజ్మా గింజలు - 200 గ్రా, అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టేబుల్‌ స్పూన్లు
ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిరపకాయలు - ఆరు, నూనె - 100గ్రా, నెయ్యి - 100గ్రా, లవంగాలు - 6
దాల్చినచెక్క - చిన్న ముక్కలు నాలుగు, ఉప్పు - తగినంత
తయారీ విధానం :
ముందురోజు రాత్రి రాజ్మా గింజల్ని నానబెట్టాలి. బిర్యానీ తయారు చేయడానికి ముందు బియ్యాన్ని కడిగి పెట్టుకోవాలి. కాడలు లేకుండా పుదీనా ఆకులను తుంచి శుభ్రంగా కడిగి గ్రైండ్‌ చేసుకోవాలి. వెడల్పుగా ఉన్న గిన్నెలో నూనె, నెయ్యి వేసి కాగిన తర్వాత లవంగాలు, దాల్చినచెక్క వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, రాజ్మాగింజలు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఇప్పుడు పుదీనా పేస్టు వేసి దోరగా వేయించి తగినంత నీరు పోసి ఉప్పు వేయాలి. నీళ్లు మరిగిన తరువాత బియ్యం వేసి ఉడకనివ్వాలి. అంతే పుదీనా - రాజ్మా బిర్యానీ రెడీ అయినట్లే.

Updated Date - 2015-09-01T18:05:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising