ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెసర పునుకుల బిర్యానీ

ABN, First Publish Date - 2015-09-01T18:01:12+05:30

కావలసిన పదార్థాలు : పెసరపప్పు - 159 గ్రా, బాస్మతి బియ్యం - అరకిలో, యాలకులు - 4,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు :  పెసరపప్పు - 159 గ్రా, బాస్మతి బియ్యం - అరకిలో, యాలకులు - 4, లవంగాలు - 8, దాల్చినచెక్క - రెండు ముక్కలు, బిర్యాని ఆకులు - రెండు, సాజీరా - చెంచా
అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు చెంచాలు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిరపకాయలు - 8, కొత్తిమీర - కట్ట, పుదీనా - కట్ట, నూనె - సరిపడా, నెయ్యి - చెంచా
ఉప్పు - తగినంత, నీళ్లు - సరిపడా
తయారీ విధానం :
పెసరపప్పును రెండు గంటల ముందు నానబెట్టాలి. నానిన పప్పును కొంచెం బరకగా రుబ్బుకుని కొంచెం ఉప్పు కలుపుకోవాలి. బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత రుబ్బిపెట్టుకున్న పెసరపిండిని చిన్న చిన్న పునుకులుగా వేసి వేయించుకోవాలి. తర్వాత బాస్మతి బియాన్ని కడిగి పది నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి గిన్నెలో నెయ్యి, నూనె పోసి కాగిన తర్వాత లవంగాలు, సాజీరా, యాలకులు, దాల్చినచెక్క, బిర్యానిఆకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా వేసి వేగిన తర్వాత కడిగి ఆరబెట్టుకున్న బియ్యాన్ని రెండు నిమిషాలు వేయించి, బియ్యానికి రెండు రెట్లు నీరు పోయాలి. సరిపడా ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. సగం ఉడికిన తర్వాత వేయించి పెట్టుకున్న పునుకులు, కొత్తిమీర వేసి కలిపి ఆవిరి పోకుండా మూతపెట్టి సన్నటి సెగపై ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి. అంతే పెసర పునుకుల బిర్యాని సిద్ధం.

Updated Date - 2015-09-01T18:01:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising