ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోధుమ ఆపిల్‌ కేక్‌

ABN, First Publish Date - 2015-08-30T16:47:25+05:30

కావలసిన పదార్థాలు : గోధుమపిండి - 150గ్రా., పెద్ద ఆపిల్స్‌ - 3, నిమ్మకాయలు - 2, నీరు - 160 మి.లీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు : గోధుమపిండి - 150గ్రా., పెద్ద ఆపిల్స్‌ - 3, నిమ్మకాయలు - 2, నీరు - 160 మి.లీ., బటర్‌ - 125 గ్రా., పంచదార - 250 గ్రా., ఉప్పు - అర టీ స్పూను, సోడా - అర టీ స్పూను, బేకింగ్‌ పౌడరు - 1టీ స్పూను, దాల్చినచెక్క పౌడరు - 1 టీ స్పూను, కిస్‌మిస్‌ - 120 గ్రా., క్రీమ్‌ - 150 గ్రా., గుడ్లు - 2.
తయారుచేసే విధానం : ఆపిల్స్‌ను (తొక్క, గింజలు వేరుచేసి) చిన్న ముక్కలుగా తరగాలి. నిమ్మకాయల తొక్క, గింజలు తీసి గుజ్జులా చేసుకోవాలి. ఆపిల్‌ముక్కల్ని, నిమ్మగుజ్జుని నీటితో కలిపి సన్నటి సెగమీద ముక్కలు మెత్తబడే దాకా ఉడికించాలి. ఒక పాత్రలో క్రీమ్‌, బటర్‌, పంచదార, గుడ్లు, గోధుమపిండి, దాల్చినచెక్కపొడి ఒకదాని తర్వాత ఒకటేసి అన్నీ కరిగేలా గిలకొట్టుకోవాలి. తర్వాత ఉడికించిన ఆపిల్‌ గుజ్జుని, కిస్‌మిస్‌ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెన్నరాసిన 8 అంగుళాల చుట్టుకొలతున్న పాత్రలోకి తీసుకొని ఓవెన్‌లో (180 డిగ్రీ సెంటీగ్రేడ్‌ దగ్గర) అరగంట ఉంచితే ఆపిల్‌కేక్‌ రెడీ.

Updated Date - 2015-08-30T16:47:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising