ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బూడిద గుమ్మడి కాయ కూటు

ABN, First Publish Date - 2015-08-29T23:39:18+05:30

కావలసిన పదార్థాలు: కందిపప్పు - ముప్పావు కప్పు, పసుపు - చిటికెడు, బూడిద గుమ్మడి ముక్కలు - 1 కప్పు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: కందిపప్పు - ముప్పావు కప్పు, పసుపు - చిటికెడు, బూడిద గుమ్మడి ముక్కలు - 1 కప్పు, పచ్చిమిర్చి - 2, ఉప్పు - రుచికి తగినంత. మసాల కోసం: శనగపప్పు - ఒకటిన్నర టీ స్పూన్లు, కందిపప్పు - 1 టీ స్పూను, దనియాలు - 1 టీ స్పూను, ఎండుమిర్చి - 6, ఎండు కొబ్బరి తురుము - 3 టీ స్పూన్లు. తాలింపు కోసం: నూనె - 3 టీ స్పూన్లు, ఆవాలు - ఒక స్పూను, ఇంగువ - చిటికెడు, కరివేపాకు - 4 రెబ్బలు.
తయారుచేసే విధానం: చిటికెడు పసుపు వేసి కందిపప్పుని కుక్కర్లో ఉడికించి పక్కనుంచాలి. దనియాలు, ఎండుమిర్చి, కంది, శనగ పప్పుల్ని దోరగా వేగించి ఎండు కొబ్బరితోపాటు కొద్దిగా నీళ్లు చిలకరించి బరకగా దంచుకోవాలి. గుమ్మడి ముక్కల్లో చిటికెడు పసుపు, ఉప్పు వేసి సగం ఉడికిన తర్వాత మసాల పొడి వేయాలి. ముక్కలు పూర్తిగా ఉడికిన తర్వాత రుబ్బిన పప్పు కలిపి మరో పది నిమిషాలు ఉడికించి విడిగా పెట్టుకున్న తాలింపు కలపాలి. ఈ కూటు అన్నంతో పాటు రోటీలోకి కూడా బాగుంటుంది.

Updated Date - 2015-08-29T23:39:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising