ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రెడ్‌ జిలేబి

ABN, First Publish Date - 2015-11-17T15:15:45+05:30

కావలసిన పదార్థాలు : బ్రెడ్‌ ముక్కలు-4, పంచదార-అర కప్పు, మంచినీళ్లు-అర కప్పు, యాలకుల పొడి-పావు టీస్పూన్‌, ఫుడ్‌ కలర్‌-చిటికెడు(ఇష్టపడితేనే), నూనె-తగినంత.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు : బ్రెడ్‌ ముక్కలు-4, పంచదార-అర కప్పు, మంచినీళ్లు-అర కప్పు, యాలకుల పొడి-పావు టీస్పూన్‌, ఫుడ్‌ కలర్‌-చిటికెడు(ఇష్టపడితేనే), నూనె-తగినంత.
తయారుచేయు విధానం : బ్రెడ్‌ ముక్కలను కుకీ కట్టర్‌తో గుండ్రని బిస్కెట్‌ ఆకారంలో కట్‌ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పంచదార వేసి అందులో మంచినీళ్ళు పోసి దాన్ని స్టవ్‌పై పెట్టాలి. పంచదార కరిగేవరకు గరిటెతో తిప్పుతూ అయిదు నిమిషాలపాటు మరగనివ్వాలి. తరువాత పంచదార పాకాన్ని కిందికి దించి చల్లారాక అందులో ఫుడ్‌ కలర్‌, యాలకుల పొడి కలపాలి. స్టవ్‌పై బాణలి ఉంచి, తగినంత నూనె పోసి, అది వేడెక్కాక అందులో గుండ్రంగా కట్‌ చేసుకుని పెట్టుకున్న బ్రెడ్‌ ముక్కలను వేసి సన్నటి మంటపై దోరగా వేగించాలి. వేగిన బ్రెడ్‌ ముక్కలను పంచదార పాకంలో వేసి, అయిదు నిమిషాల తర్వాత తీసి వేడిగా ఉన్నప్పుడే సర్వ్‌ చేయాలి.

Updated Date - 2015-11-17T15:15:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising