ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనీర్‌ జామూన్‌

ABN, First Publish Date - 2015-09-02T22:12:58+05:30

కావలసిన పదార్థాలు : కోవా - 60 గ్రా., పనీర్‌ 10 గ్రా., మైదా - 10 గ్రా.,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు : కోవా - 60 గ్రా., పనీర్‌ 10 గ్రా., మైదా - 10 గ్రా., యాలకుల పొడి - 6 గ్రా., పాలు - 1 లీటరు, పంచదార - 100గ్రా., కుంకుమపువ్వు - 2 గ్రా., పాకానికి - (నీరు 20 మి.లీ. + పంచదార 90 గ్రా), అలంకరణకు తరిగిన పిస్తా , బాదంలతో పాటు కొంత సిల్వర్‌ లీఫ్‌.
తయారుచేసే విధానం : ఒక పాత్రలో సన్నగా తరిగిన పనీర్‌, కోవా, మైదా, యాలకులపొడి వేసి మెత్తగా ముద్దలా కలుపుకోవాలి (అవసరమైతే కొన్ని పాలు కలుపుకోవచ్చు). దీన్ని చిన్న నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకుని నూనెలో దోరగా వేగించి పంచదార పాకంలో (ముందే తయారుచేసి ఉంచుకోవాలి) నానవేయాలి. మరో పాత్రలో పాలను, పంచదారను కలిపి 30 శాతం మిగిలేలా మరిగించుకోవాలి. పాకంలో నానిన ఉండల్ని ఒక పాత్రలోకి తీసుకుని పాల మిశ్రమాన్ని వాటిపైన మునిగేలా పోసి పిస్తా, బాదం, సిల్వర్‌లీఫ్‌లతో అలంకరిచి తినాలి.

Updated Date - 2015-09-02T22:12:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising