ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనీర్‌ కట్లీ

ABN, First Publish Date - 2015-08-30T21:21:43+05:30

కావలసిన పదార్థాలు: కారెట్లు - 30 గ్రాములు, క్యాప్సికం - 30 గ్రాములు, క్యాబేజి - 15 గ్రాములు, బంగాళదుంపలు - 15 గ్రాములు, నెయ్యి - 20 గ్రాములు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
కారెట్లు - 30 గ్రాములు, క్యాప్సికం - 30 గ్రాములు, క్యాబేజి - 15 గ్రాములు, బంగాళదుంపలు - 15 గ్రాములు, నెయ్యి - 20 గ్రాములు, షాజీరా - 3 గ్రాములు, కారం - 5 గ్రాములు, పసుపు - 3 గ్రాములు, జీలకర్ర పొడి - 5 గ్రాములు, గరంమసాలా-2 గ్రాములు, పలుచని పన్నీర్‌ ముక్కలు (3 అంగుళాల పొడవు, వెడల్పుతో) బ్రెడ్‌ పొడి - 50 గ్రాములు, చాట్‌మసాలా - 10 గ్రాములు, ఉప్పు రుచికి తగినంత.
పన్నీర్‌ కట్లీలు ముంచడానికి: షాజీరా - 2 గ్రాములు, పసుపు - 2 గ్రాములు, పసుపు మిర్చి పొడి - 2 గ్రాములు, మొక్కజొన్న పిండి - 10 గ్రాములు, మైదా - 10 గ్రాములు, ఉప్పుతగినంత.
 
తయారుచేసే విధానం
 
కడాయిలో నెయ్యితో షాజీరాని పోపు వేసుకుని, సన్నగా తరిగిన కూరగాయల ముక్కల్ని వేసి వేగించాలి. తర్వాత మిగతా పొడులన్నీ వేసి బాగా కలిపి, పక్కనుంచుకోవాలి. పన్నీర్‌ ముక్కలపై కూరగాయల వేపుడుని కొద్దిగా వేసి చుట్టాలి. జారుగా కలుపుకొని ఉంచుకున్న మైదా, మొక్కజొన్న పిండిలో పన్నీర్‌ రోల్స్‌ని ముంచి బ్రెడ్‌ పొడిలో దొర్లించి రెండు వైపులా నేతిలో దోరగా వేగించుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే చాట్‌మసాలా చల్లుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.
 
 

Updated Date - 2015-08-30T21:21:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising