ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కజ్జికాయ సమోసాలు

ABN, First Publish Date - 2015-09-02T17:57:10+05:30

కావలసినవి: మైదా - 500 గ్రాములు, పచ్చిబఠానీలు - ఒక క ప్పు, కొబ్బరి తురిమినది - అర క ప్పు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: మైదా - 500 గ్రాములు, పచ్చిబఠానీలు - ఒక క ప్పు, కొబ్బరి తురిమినది - అర క ప్పు, పసుపు - ఒక టీ స్పూన్‌, జీలకర్ర పొడి - ఒక టీ స్పూన్‌, కారం - అర టీ స్పూన్‌, గరం మసాల - ఒక టీ స్పూన్‌, పంచదార - ఒక టీ స్పూన్‌, నూనె తగినంత, ఉప్పు తగినంత...
తయారీ విధానం:
మైదాలో ఉప్పు, నీరు వేసి పిండి మృదువుగా వచ్చేలా కలిపి ఉంచుకోండి. రెండు టేబుల్‌ స్పూన్‌ల నూనె వేడి చేసి అందులో పలుకుగా రుబ్బి ఉంచుకున్న బఠానీలు, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాల, కారం వేసి బాగా కలియబెట్టండి. అందులోనే కొబ్బరి, ఉప్పు, పంచదార వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి.
తరువాత మైదాని చిన్న ముద్దలుగా తీసుకుని కొంచెం వెడల్పుగా గుండ్రంగా వత్తి అందులో రెండు టీ స్పూన్ల బఠానీ కూరని పెట్టి చుట్టూ అంచులు జాగ్రత్తగా వత్తండి. ఇలా తయారు చేసి పెట్టుకున్న అర్ధచంద్రాకారపు సమోసాలని కాగిన నూనెలో వేసి ఎర్రగా వేగించండి. వేడి వేడిగా ఏదైనా చట్నీతో తింటే ఈ వర్షాకాలం చాలా బాగుంటాయి.

Updated Date - 2015-09-02T17:57:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising