ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రొయ్య కబాబ్‌

ABN, First Publish Date - 2015-09-01T20:52:27+05:30

కావలసిన పదార్థాలు: పెద్ద రొయ్యలు - అరకేజి. మొదటిసారి కలపడానికి: ఉల్లిపాయ గుజ్జు -150 గ్రా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: పెద్ద రొయ్యలు - అరకేజి. మొదటిసారి కలపడానికి: ఉల్లిపాయ గుజ్జు -150 గ్రా., పసుపు - 1 టీ స్పూను, చింతపండు గుజ్జు- 50 గ్రా., ఉప్పు- కొంచెం. రెండోసారి కలపడానికి: ధనియాల పొడి - 100 గ్రా., జీలకర్ర పొడి - 75 గ్రా., మిరియాల పొడి - 50 గ్రా., కారం - 50 గ్రా., కొబ్బరి తురుము - 50 గ్రా., నెయ్యి - 1 టేబుల్‌ స్పూను.
మూడోసారి కలపడానికి: ఉల్లిపాయ గుజ్జు - 100 గ్రా., చింతపండు గుజ్జు - 100 గ్రా., కారం - 1 టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం: రొయ్యల్ని శుభ్రం చేశాక మొదటిసారి పదార్థాలన్నీ కలిపి అందులోనే రొయ్యల్ని వేసి 2 గంటలపాటు ఉంచాలి. తర్వాత రొయ్యల్ని కడిగి పెట్టుకోవాలి. రెండోసారి కలిపే పదార్థాలను నేతిలో వేగించి అందులోనే మూడోసారి కలిపే పదార్థాలను కూడా వేసి చిక్కని పేస్టులా తయారుచేసుకోవాలి. రొయ్యల్ని ఈ పేస్టులో 3 గంటలపాటు నానబెట్టి తీసి సన్నని ఊసలకు గుచ్చి బొగ్గులపై దోరగా కాల్చుకోవాలి. బొగ్గులు దొరకని పక్షంలో గ్యాస్‌ స్టౌవ్‌పైన కూడా కాల్చుకోవచ్చు. వీటిని అన్నంతో పాటు నంజుకుంటే చాలా రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-09-01T20:52:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising