ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిస్కట్‌ కేసరి

ABN, First Publish Date - 2015-08-30T23:11:29+05:30

కావలసినవి: జెల్లీ క్రిస్టల్‌ ఒక పేకెట్‌, చిక్కటి క్రీమ్‌ (తాజాది) 200 మి.లీ., చాకొలేట్‌ కలర్‌లో ఉండే ఏ ఫ్లేవర్‌ బిస్కెట్లయినా 150 గ్రా., వెన్న బిస్కెట్లు 150 గ్రా.,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: జెల్లీ క్రిస్టల్‌ ఒక పేకెట్‌, చిక్కటి క్రీమ్‌ (తాజాది) 200 మి.లీ., చాకొలేట్‌ కలర్‌లో ఉండే ఏ ఫ్లేవర్‌ బిస్కెట్లయినా 150 గ్రా., వెన్న బిస్కెట్లు 150 గ్రా., మారీ బిస్కెట్లు లేదా ఆ కలర్‌లో ఉండే వేరే బిస్కెట్లు 150 గ్రా., వెన్న 250 గ్రా., నీళ్లు 60 మి.లీ.
ఎలా చేయాలి
మూడు రకాల బిస్కెట్లను విడివిడిగా పొడుం చేసి పక్కన పెట్టుకోవాలి. వెన్నని మూడు భాగాలుగా చేయాలి. ఒక్కో భాగాన్ని ఒక్కో రకం బిస్కెట్ల పొడిలో వేసి కలపాలి. తర్వాత నీటిని వేడి చేసి వాటిలో జెల్లీ క్రిస్టల్స్‌ని వేసి కరిగించాలి. ఈ మిశ్రమంలో క్రీమ్‌ వేసి బాగా గిలక్కొట్టాలి. దీన్ని నెయ్యి రాసిన ఒక ప్లేట్‌లో లేదా గిన్నెలో పోసి 20 నిమిషాల పాటు ఫ్రీజర్‌లో పెట్టాలి. తర్వాత దాన్ని ఫ్రీజర్‌ నుంచి బయటకి తీసి ఫ్రిజ్‌లో మరో 20 నిమిషాల పాటు పెట్టాలి. ఇలా చేయడం వల్ల మిశ్రమం బాగా గట్టిపడుతుంది. తర్వాత దాన్ని బయటికి తీసి పైన ఈ మూడు రకాల బిస్కెట్ల పొడుంలను వలయాకారంలో గాని, గడులుగా గాని, అడ్డంగా గాని వరుసగా పోసి అలంకరించాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టాలి. దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వేరే రంగులు కావాలనుకునేవారు బిస్కెట్ల పొడిలోనే ఆయా రంగులు కలుపుకోవచ్చు.

Updated Date - 2015-08-30T23:11:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising