ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంకాయ మంచూరియా

ABN, First Publish Date - 2015-08-30T21:34:08+05:30

కావలసిన పదార్థాలు: వంకాయలు - 4, వెల్లుల్లి తరుగు - 4 టేబుల్‌ స్పూన్లు, అల్లం తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి - 1, కొత్తిమీర తరుగు - 4 టేబుల్‌ స్పూన్లు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: వంకాయలు - 4, వెల్లుల్లి తరుగు - 4 టేబుల్‌ స్పూన్లు, అల్లం తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి - 1, కొత్తిమీర తరుగు - 4 టేబుల్‌ స్పూన్లు, ఉల్లికాడల తరగు - 1 కప్పు, సోయా సాస్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, టమోటా సాస్‌ - 3 టేబుల్‌ స్పూన్లు, పంచదార - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - ఒకటిన్నర టేబుల్‌ స్పూను, జారు కోసం: కార్న్‌ఫ్లోర్‌, మైదా -8 టేబుల్‌ స్పూన్ల చొప్పున, ఉప్పు - చిటికెడు.
 
తయారుచేసే విధానం: మైదా, కార్న్‌ఫ్లోర్‌, ఉప్పుని కొద్ది నీటితో జారుగా కలుపుకోవాలి. వంకాయలను పొడుగ్గా ‘ఫింగర్స్‌’ లా కట్‌ చేసుకుని జారులో ముంచి నూనెలో దోరగా వేగించాలి. ఇప్పుడు నూనెలో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేగించాలి. మంట తగ్గించి సోయా, టమోటా సాస్‌లు, పంచదార, ఉప్పు వేసి 2 నిమిషాల తర్వాత అరకప్పు నీరు పోసి ఉడికించాలి. గ్రేవీ చిక్కబడ్డాక వంకాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి 5 నిమిషాల తర్వాత దించేసి, ఉల్లికాడలతో అలంకరించాలి.

Updated Date - 2015-08-30T21:34:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising