ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిలకడదుంప పాన్‌ కేక్‌

ABN, First Publish Date - 2015-10-06T17:36:34+05:30

కావలసిన పదార్థాలు: మైదా- 1 కప్పు, గోధుమ పిండి- 1/4 కప్పు, ఉడికించి చిదుముకున్న చిలకడ దుంపలు- 1 కప్పు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: మైదా- 1 కప్పు, గోధుమ పిండి- 1/4 కప్పు, ఉడికించి చిదుముకున్న చిలకడ దుంపలు- 1 కప్పు, పంచదార- 1/2 కప్పు, తేనె- 2 టేబుల్‌ స్పూన్లు, పాలు- 1 కప్పు, గుడ్లు- 2, దాల్చినచెక్క పొడి- 1/2 టీస్పూను, బేకింగ్‌ పౌడర్‌- 1 టీస్పూను, వెన్న- 3 టేబుల్‌ స్పూన్లు, నూనె- సరిపడా.
తయారీ విధానం: మైదా, గోధుమ పిండి, బేకింగ్‌ పౌడర్‌లను ఒక గిన్నెలో వేసి పాలుపోస్తూ జారుగా కలుపుకోవాలి. తరువాత గుడ్లు కూడా కొట్టి పోసి, చిలకడ దుంప గుజ్జు, వెన్న, తేనె, దాల్చినచెక్క పొడి, పంచదార చేర్చి బాగా గిలకొట్టుకోవాలి. పెనం వేడిచేసి ఒకటిన్నర టీస్పూను నూనె వేసి పెనం మొత్తం వ్యాపించేలా అటూ ఇటూ కదపాలి. తయారు చేసుకున్న పిండిని రొట్టెలా వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒకవైపు ఉడికిన తరువాత మరో వైపు తిప్పి ఉడికించాలి. వెజిటేరియన్‌ వాళ్లు గుడ్లు వాడకుండా కూడా కూడా చేసుకోవచ్చు.

Updated Date - 2015-10-06T17:36:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising