ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనీర్‌ ప్రైడ్‌ స్లయిసెస్‌

ABN, First Publish Date - 2015-09-01T20:47:23+05:30

కావలసినవి: బ్రెడ్‌ స్లయిసెస్‌లా ఉండే పనీర్‌ ముక్కలు 4, నిమ్మరసం 2 టేబుల్‌ స్పూన్లు, చిల్లీ సాస్‌ ఒక టేబుల్‌ స్పూను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: బ్రెడ్‌ స్లయిసెస్‌లా ఉండే పనీర్‌ ముక్కలు 4, నిమ్మరసం 2 టేబుల్‌ స్పూన్లు, చిల్లీ సాస్‌ ఒక టేబుల్‌ స్పూను, సోయా సాస్‌ 2 టేబుల్‌ స్పూన్లు, తేనె ఒక టేబుల్‌ స్పూను, అల్లం ముద్ద ఒక టేబుల్‌ స్పూను, వెల్లుల్లి ముద్ద ఒక టేబుల్‌ స్పూను, మొక్కజొన్న పిండి 3 టేబుల్‌ స్పూన్లు, పాలు ఒక టేబుల్‌ స్పూను, గుడ్లు 2 (ఇష్టం లేని వాళ్లు మానేయవచ్చు), ఉప్పు తగినంత, వెన్న లేదా నూనె వేగించడానికి తగినంత.
ఎలా చేయాలి
నిమ్మరసం, తేనె, అల్లం, వెల్లుల్లి ముద్ద, ఉప్పు, సోయా, చిల్లీ సాస్‌లను బాగా కలిపి పక్కనపెట్టుకోవాలి. ఒక గిన్నెలో మొక్కజొన్న పిండి, గిలక్కొట్టిన గుడ్ల మిశ్రమం, పాలను కూడా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలో పనీర్‌ ముక్కల్ని పక్క పక్కనే పరిచి నిమ్మరసం-సోయాసాస్‌ల మిశ్రమాన్ని వాటి మీద పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ముక్కల్ని మధ్యలో అటూ ఇటూ తిప్పుతూ 2 నుంచి 4 గంటల సేపు నానబెట్టాలి. తర్వాత పనీర్‌ ముక్కల్ని ఫ్రిజ్‌లోంచి బయటకు తీసి గది ఉష్ణోగ్రతకి వచ్చేవరకు ఉంచాలి. మొక్కజొన్న పిండి మిశ్రమంలో వీటిని ముంచి వెన్నలో లేదా నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేగించాలి. వీటిని వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి.

Updated Date - 2015-09-01T20:47:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising