ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మ్యాంగో ఫిష్‌ కర్రీ

ABN, First Publish Date - 2015-08-31T21:47:45+05:30

కావలసిన పదార్థాలు: మామిడికాయలు - 2, చేపముక్కలు (శుభ్రం చేసినవి) - అరకిలో, ఎర్ర కారం - 2 టీ స్పూన్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: మామిడికాయలు - 2, చేపముక్కలు (శుభ్రం చేసినవి) - అరకిలో, ఎర్ర కారం - 2 టీ స్పూన్లు, పసుపు - చిటికెడు, మిరియాలపొడి - అర టీ స్పూను, ధనియాలపొడి - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, మసాల పొడి - 1 టీ స్పూను, కొత్తిమీర - 1 కట్ట, నూనె - అర కప్పు, ఉల్లిపాయలు -2, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం: చేప ముక్కలకు కారం, ఉప్పు, పసుపు, ధనియాల, మిరియాల పొడులు పట్టించి గంటపాటు పక్కనుంచాలి. మామిడికాయల్ని చెక్కుతీసి సన్నగా తురమాలి. ఉల్లిపాయల్ని పెద్దముక్కలుగా తరిగి అవి కొద్దిపాటి నూనెలో మగ్గిన తరువాత మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. కడాయిలో నూనె కాగాక ఉల్లిముద్దని, చేపముక్కల్ని వేగించి (గరిటతో కలపకుండా, మసిగుడ్డతో కడాయిని పట్టుకుని ఎగరించి వేగించాలి) కొన్ని నీళ్లు జతచేసి ఉడికించాలి. చేపముక్క ముప్పావుశాతం ఉడికిన తర్వాత మామడి తురుము కలపాలి. కూర దగ్గరగా వచ్చి నూనె తేలినప్పుడు మసాలపొడి కలిపి దించేసి కొత్తిమీరతో అలంకరించుకోవాలి.

Updated Date - 2015-08-31T21:47:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising