ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికెన్‌ సమోసా

ABN, First Publish Date - 2015-08-30T18:49:28+05:30

కావల్సినవి: బోన్‌లెస్‌ చికెన్‌ - 400 గ్రాములు, మైదా - 200 గ్రాములు, ఉప్పు - రుచికి తగినంత, ఆవాలు - 1 టేబుల్‌స్పూన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావల్సినవి:  బోన్‌లెస్‌ చికెన్‌ - 400 గ్రాములు, మైదా - 200 గ్రాములు, ఉప్పు - రుచికి తగినంత, ఆవాలు - 1 టేబుల్‌స్పూన్‌, జీలకర్ర - 1 టేబుల్‌స్పూన్‌, అల్లం పేస్ట్‌ - 1 టేబుల్‌స్పూన్‌, పచ్చిమిర్చి (సన్నగా తరిగినవి) - 1 టేబుల్‌స్పూన్‌, కారంపొడి - 1 టేబుల్‌స్పూన్‌, డ్రై మ్యాంగో పౌడర్‌ - 1 టేబుల్‌స్పూన్‌, గరం మసాలా పౌడర్‌ - 1 టేబుల్‌స్పూన్‌, కొత్తిమీర ఆకులు (సన్నగా తరిగినది) - రెండు టేబుల్‌స్పూన్లు, నూనె - ఫ్రై చేయడానికి తగినంత
విధానం:
మైదాలో రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి, నీటిని కొద్ది కొద్దిగా పోస్తూ గట్టిగా కలపాలి. నీటితో తడిపిన కాటన్‌క్లాత్‌లో చుట్టి పదిహేను నిమిషాలు వుంచండి. ఈ లోపు ఉప్పు కలిపిన నీటిలో ఉడికించిన చికెన్‌ ముక్కలనుంచి నీరు తీసివేసి ఓ పక్కగా ఉంచండి. పాన్‌లో తగినంత నూనెపోసి వేడిచేసి జీలకర్ర, ఆవాలు, అల్లం పేస్ట్‌, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇప్పుడు కారంపొడి, ఉప్పు, డ్రై మ్యాంగో పౌడర్‌ వేసి కలపండి. వార్చిన చికెన్‌ ముక్కలను బాణలిలో వేసి సన్నని సెగపై 5నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు గరం మసాలా, కొత్తిమీర ఆకులు వేసి చికెన్‌కర్రీని దించండి. ఇప్పుడు మైదాపిండిని పదహారు సమభాగాలుగా తీసుకొని బాల్స్‌లా చేయండి. కోన్‌ షేప్‌ వచ్చేలా చేసి అందులో చికెన్‌కర్రీని పెట్టి చివరలను మడవండి. పాన్‌లో నూనెపోసి వేడయ్యాక సన్నని సెగపై వీటిని దోరగా వేయించండి. క్యారట్‌, కీర, కొత్తిమీర ఆకులు, గుండ్రంగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను అలంకరణకు ఉపయోగించండి. ఇక వేడివేడిగా వడ్డించడమే తరువాయి.

Updated Date - 2015-08-30T18:49:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising