ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేప పులావ్‌

ABN, First Publish Date - 2015-08-26T22:37:20+05:30

కావలసినవి : రెండు కప్పుల సన్న బియ్యం, సరిపడినంత ఉప్పు రెండు టీస్పూన్ల పంచదార, ఒక బిర్యానీ ఆకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి : రెండు కప్పుల సన్న బియ్యం, సరిపడినంత ఉప్పు రెండు టీస్పూన్ల పంచదార, ఒక బిర్యానీ ఆకు, చిన్న ముక్క దాల్చిన చెక్క, మూడు యాలకులు, రెండు లవంగాలు, మూడు టేబుల్‌స్పూన్ల నెయ్యి, 300 గ్రాముల బోన్‌లెస్‌ చికెన్‌, నాలుగు టేబుల్‌స్పూన్ల మైదా పిండి, చేప ముక్కలు వేగించడానికి సరిపడా నూనె.
ఎలా చేయాలి
చేప ముక్కలపై ఉప్పు చ ల్లి మైదా పిండిని రుద్దాలి. ఇలా చేయడం వల్ల ముక్కలపై మైదా అతుక్కుంటుంది. నూనె వేడిచేసి చేప ముక్కలను మరీ కరకరలాడేట్టు కాకుండా బ్రౌన్‌ రంగు వచ్చే వరకు వేగించాలి. తరువాత నెయ్యి వేడిచేసి మసాలా దినుసులు వేసి చిటపటమనే వరకు ఉంచి బియ్యం వేసి మరో నాలుగు నిముషాలు వేగించాలి. దీనిలో పంచదార, నాలుగు కపల నీళ్లు, ఉప్పు కలపాలి. సెగను మరీ ఎక్కువ, తక్కువ కాకుండా పెట్టండి. మూతపెట్టి అన్నం ఉడికే వరకు ఉంచాలి.
దీనిలో వేగించిన చేప ముక్కలను వేసి జాగ్రత్తగా కలపాలి. మళ్లీ మూతపెట్టి సెగ తగ్గించి ఏడు నిముషాల పాటు ఉడికించాలి. దీన్ని బూందీ రైతాతో తింటే బాగుంటుంది.


Updated Date - 2015-08-26T22:37:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising