ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తోటకూర వేపుడు

ABN, First Publish Date - 2015-12-16T14:34:55+05:30

కావలసిన పదార్థాలు: తోట కూర - ఆరు కట్టలు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిరపకాయలు - నాలుగు, శెనగపప్పు - ఒక టేబుల్‌ స్పూను, మినపపప్పు - ఒక టేబుల్‌ స్పూను, ఎండు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: తోట కూర - ఆరు కట్టలు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిరపకాయలు - నాలుగు, శెనగపప్పు - ఒక టేబుల్‌ స్పూను, మినపపప్పు - ఒక టేబుల్‌ స్పూను, ఎండు మిరపకాయలు - రెండు, వెల్లుల్లి రేకలు - నాలుగు, కరివేపాకు - ఒక రెబ్బ, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: ఉల్లిపాయని ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి. తరువాత తోటకూరని కూడా సన్నగా తరగాలి. ఇప్పుడు స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా వెడెక్కాక వెల్లుల్లి రేకలు, శెనగపప్పు, మినపపప్పు వేసి ఎర్రగా వేయించుకోవాలి. తరువాత ఎండు మిరపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించాలి. చివర్లో కొద్దిగా పసుపు, ఉప్పు, తోటకూర తురుము వేసి వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత దించేయాలి.

Updated Date - 2015-12-16T14:34:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising