ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆపిల్‌ కిచిడీ

ABN, First Publish Date - 2015-11-27T14:56:29+05:30

కావలసినవి: ఆపిల్స్‌ - 2, బాస్మతి బియ్యం ఒక కప్పు, మిర్చి - 1, పెద్ద ఉల్లిపాయ-1, జీడిపప్పు, బాదం పప్పు, కిస్‌మిస్‌, ద్రాక్ష, చెర్రీస్‌ - తగినన్ని,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
ఆపిల్స్‌ - 2, బాస్మతి బియ్యం ఒక కప్పు, మిర్చి - 1, పెద్ద ఉల్లిపాయ-1, జీడిపప్పు, బాదం పప్పు, కిస్‌మిస్‌, ద్రాక్ష, చెర్రీస్‌ - తగినన్ని, దాల్చిన చెక్క - చిన్న ముక్క, లవంగాలు - 4, యాలక్కాయ - 1, నెయ్యి - 4 స్పూన్లు, ఉప్పు- తగినంత.

తయారీ విధానం
 
బియ్యాన్ని పలుకుగా ఉడికించి వడేసి పెట్టుకోవాలి. తరువాత యాపిల్‌ని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఉల్లిపాయని సన్న ముక్కలుగా కోసుకోవాలి. మిర్చిని పొడవుగా కోయాలి. బాండీని వేడి చేసి దాంట్లో నెయ్యి వేసి, జీడిపప, బాదం, కిస్‌మిస్‌, దాల్చినచెక్క, లవంగాలు, యాలక్కాయ, ఉల్లిపాయ, మిరపకాయలు వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి. ఇదే బాండీలో ఉడికించి వడకట్టిన బియ్యాన్ని వేసి అందులో కొంచెం ఉప్పు వేసి కలపాలి. దీనిపైన ముందుగా వేగించి పెట్టుకున్న మసాలా కాస్త వేసి, ఆ పైన మళ్ళీ అన్నం వేసి, పైన మళ్ళీ మసాల వేసి మూతపెట్టాలి. సన్నగా తరిగిన యాపిల్‌ ముక్కలు వేసి పది నిమిషాలు వేడి మీద ఉంచి దించివేయాలి. వడ్డించేటప్పుడు పైన చెర్రీస్‌, ద్రాక్ష, కిస్‌మిస్‌ వేసి పొడవుగా కోసుకున్న యాపిల్‌ ముక్కల్ని ప్లేట్‌ చుట్టూరా పెడితే అందంగా ఉంటుంది.
 
 

Updated Date - 2015-11-27T14:56:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising