ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనీర్‌ కాలీ మిర్చి

ABN, First Publish Date - 2015-10-24T16:18:24+05:30

కావలసిన పదార్థాలు: పన్నీర్‌ ముక్కలు: అరకిలో, పుదీనా, కొత్తిమీర: ఒక్కొక్క కట్ట చొప్పున, నెయ్యి: రెండు స్పూన్లు, గట్టి పెరుగు: కప్పు, ఉల్లిపాయలు: రెండు(ముక్కలుగా చేసుకోవాలి), బిర్యానీ ఆకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: పన్నీర్‌ ముక్కలు: అరకిలో, పుదీనా, కొత్తిమీర: ఒక్కొక్క కట్ట చొప్పున, నెయ్యి: రెండు స్పూన్లు, గట్టి పెరుగు: కప్పు, ఉల్లిపాయలు: రెండు(ముక్కలుగా చేసుకోవాలి), బిర్యానీ ఆకు: కొద్దిగా, దాల్చినచెక్క: చిన్నది, యాలకులు: మూడు, లవంగాలు: నాలుగు, ధనియాల పొడి: రెండు స్పూన్లు, మిరియాలు, జీలకర్ర పొడి: చెరో టేబుల్‌ స్పూను, గరం మసాలా: అర టీ స్పూను, క్రీము: వంద గ్రాములు, పచ్చిమిరపకాయలు: మూడు లేదా నాలుగు, అల్లం వెల్లుల్లి ముద్ద: రెండు టేబుల్‌ స్పూన్లు
తయారీ విధానం: ముందుగా మందపాటి గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలు నూనెలో వేయించుకుని చల్లారిన తరువాత పచ్చిమిరప కాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద కలిపి ముద్దగా నూరుకొని పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో మిగిలిన నెయ్యి వేసి కాగిన తరువాత బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క వేసి దోరగా వేయించుకుని రుబ్బిపెట్టుకున్న ఉల్లిపాయ ముద్ద కూడా జత చేసి మరికొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, ఉప్పు వేసి కొద్దిగా నీరు పోసుకోవాలి. నీరు మరుగుతున్న సమయంలో పన్నీర్‌ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్‌ కొద్దిగా ఉడుకుతున్న సమయంలో పుదీన, మిరియాల పొడి, గరం మసాలా పొడి, క్రీము వేసుకోవాలి. గిన్నె మీద మూత పెట్టకుండా, మైదాపిండిని ముద్దగా చేసుకొని గిన్నె అంచుల చుట్టూ అంటించి ఇప్పుడు మూత పెట్టి దాని మీద బరువైన వస్తువు పెట్టాలి. నీరంతా ఇంకి పోయేవరకూ వుంచి మూత, గిన్నె అంచులకు వున్న మైదాపిండి తీసేసుకోవాలి. దించే ముందు కొత్తిమీర చల్లుకోవాలి.

Updated Date - 2015-10-24T16:18:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising