ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్న్‌ పలావ్‌

ABN, First Publish Date - 2015-10-24T16:08:17+05:30

మసాలాకు కావలసిన పదార్థాలు: ఉల్లి పాయలు: రెండు(ముక్కలుగా చేసుకోవాలి), టమోటాలు: రెండు(ముక్కలుగా చేసుకోవాలి), వెల్లుల్లి రెమ్మలు: నాలుగు, అల్లం: చిన్న ముక్క, గరంమసాలా పొడి:

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మసాలాకు కావలసిన పదార్థాలు
 
ఉల్లి పాయలు: రెండు(ముక్కలుగా చేసుకోవాలి), టమోటాలు: రెండు(ముక్కలుగా చేసుకోవాలి), వెల్లుల్లి రెమ్మలు: నాలుగు, అల్లం: చిన్న ముక్క, గరంమసాలా పొడి: టేబుల్‌ స్పూను, కారం: టేబుల్‌ స్పూను, ధనియాల పొడి: టేబుల్‌ స్పూను, పచ్చిమిరపకాయలు: రెండు
 
పలావ్‌కు కావలసిన పదార్థాలు

బాసుమతి బియ్యం: కప్పు, అమెరికన్‌ కార్న్‌ గింజలు: ముప్పావు కప్పు, ఉల్లిపాయలు: రెండు(ముక్కలు చేసుకోవాలి), బఠాణీలు: పావుకప్పు, యాలకులు: రెండు లేదా మూడు, జీడిపప్పు: పది పప్పులు, దాల్చినచెక్క: చిన్నది, లవంగాలు: మూడు లేదా నాలుగు, కుంకుమపువ్వు: కొద్దిగా, కొత్తిమీర: కొద్దిగా, పాలు: టేబుల్‌ స్పూను, నెయ్యి: తగినంత, ఉప్పు: రుచికి సరిపడ
 
తయారీ విధానం
 
ముందుగా మసాలా దినుసులన్నీ మెత్తగా రుబ్బుకుని పక్కన పెట్టు కోవాలి. పాలలో కుంకుమ పువ్వు వేసి పది నిమిషాలు నాననివ్వాలి. బియ్యం శుభ్రం చేసి కడుక్కుని కనీసం అరగంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు కుక్కర్‌లో నెయ్యి వేసి కాగిన తరువాత యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, జీడిపప్పు వేసి వేగనివ్వాలి. అనంతరం ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇవి వేగిన తరువాత రుబ్బిపెట్టుకున్న మసాలా, అమెరికన్‌ కార్న్‌ వేసి కొద్దిసేపు వేగనిచ్చి బియ్యం కూడా జతచేయాలి. కప్పు బియ్యానికి రెండుకప్పుల నీరు పోసి కుక్కర్‌లో రెండు లేదా మూడు విజిల్స్‌ వచ్చే వరకూ వుంచి దించేయాలి. దించిన తరువాత మూత తీసి కొత్తిమీర చల్లి బిర్యాని మొత్తం కలియపెట్టుకోవాలి.
 
 

Updated Date - 2015-10-24T16:08:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising