ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొలకెత్తిన పెసల కూర

ABN, First Publish Date - 2015-08-29T23:18:05+05:30

కావలసినవి: రెండు కప్పులు లేదా 200 గ్రాముల మొలకెత్తిన పెసలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ (చిన్నది) ఒకటి, నాలుగు వెల్లుల్లి రెబ్బలు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: రెండు కప్పులు లేదా 200 గ్రాముల మొలకెత్తిన పెసలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ (చిన్నది) ఒకటి, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, అర టీస్పూను పసుపు, రెండు టీస్పూన్ల కారం, ఒక టీస్పూను జీలకర్ర, ఒక కప్పు తాజాగా తురిమిన కొబ్బరి కోరు, ఒక టీస్పూను బెల్లం, ఒక టీస్పూను చిక్కటి చింతపండు గుజ్జు, అర టీస్పూను ఆవాలు, చిటికెడు ఇంగువ, రెండు టేబుల్‌ స్పూన్ల కొత్తిమీర, నాలుగు టేబుల్‌ స్పూన్ల నూనె.
తయారీ విధానం
జీలకర్ర, వెల్లుల్లి, కొబ్బరికోరులో అరకప్పు నీళ్లు కలిపి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, ఇంగువ వేయాలి. ఆవాలు చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేసి అవి రంగు మారే వరకు ఉంచాలి. తరువాత మొలకెత్తిన పెసలు వేసి రెండు నిముషాల పాటు వేగించి అందులో కొబ్బరి పేస్ట్‌, పసుపు, కారం, చింతపండు గుజ్జు, బెల్లం, ఉప్పు ఒక కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. నీళ్లు ఆవిరై మిశ్రమం చిక్కగా అయ్యే వరకు స్టవ్‌ మీద ఉంచాలి. తర్వాత పైన కొత్తిమీర వేసి చపాతీతో వేడివేడిగా తినాలి.
్‌పెసర మొలకలను నీళ్లతో మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగాలి. ఎక్కువగా ఉడికించకూడదు. ఈ కూరను ఇతర గింజలతో కూడా చేసుకోవచ్చు. మసాలా ఇదే వాడొచ్చు. అయితే పెసర మొలకలతోనే రుచి బాగుంటుంది.

Updated Date - 2015-08-29T23:18:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising