ఫింగర్ పనీర్
ABN, First Publish Date - 2015-09-04T18:56:16+05:30
కావలసిన పదార్థాలు: పనీర్ - 200 గ్రా., నిమ్మరసం - 1 టీ స్పూను, కారం - 1 టీ స్పూను
కావలసిన పదార్థాలు: పనీర్ - 200 గ్రా., నిమ్మరసం - 1 టీ స్పూను, కారం - 1 టీ స్పూను, కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి - అర టీ స్పూను, బ్రెడ్ పౌడర్ - 1 కప్పు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: పనీర్‌ను 2 అంగుళాల పొడువున, నలుపలకలుగా కట్ చేసి మిరియాలపొడి కలిపిన నిమ్మరసం పట్టించాలి. మైదా, కార్న్‌ఫ్లోర్, కారం, ఉప్పు నీటితో జారుగా తయారుచేసుకుని ఒక్కో పనీర్ ముక్కని ముంచి, బ్రెడ్ పొడిలో పొర్లించి నూనెలో దోరగా (లోపలి పనీర్ ఉడికేలా చిన్నమంటపై) వేగించుకోవాలి. సాయంత్రం టిఫిన్‌గా తయారుచేసుకుని టమోటా సాస్‌తో నంజుకు తింటూ ఎంజాయ్ చేయవచ్చు.
Updated Date - 2015-09-04T18:56:16+05:30 IST