ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలు దోస బజ్జీలు

ABN, First Publish Date - 2015-08-26T22:31:20+05:30

కావలసినవి: ఆలు 500 గ్రా., దోసకాయలు మీడియం సైజువి 2, మిరియాల పొడి 1/2 టీస్పూను, ఉప్పు తగినంత.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: ఆలు 500 గ్రా., దోసకాయలు మీడియం సైజువి 2, మిరియాల పొడి 1/2 టీస్పూను, ఉప్పు తగినంత.
పూతపిండికి: శెనగపిండి 2 క ప్పులు, ఉల్లివిత్తనాలు ఒక టీ స్పూను, నూనె వేగించడానికి సరిపడా, ఉప్పు తగినంత.
తయారుచేసే విధానం
ఆలుగడ్డల్ని చెక్కుతీసి ఫోటోలో చూపిన విధంగా వెడల్పాటి ముక్కలుగా కోసిపెట్టుకోవాలి. ఉప్పు నీళ్ళలో పది నిమిషాలు నానబెట్టి ఉంచాలి. తర్వాత నీళ్ళు ఒడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళు వేడిచేసి దానిలో ఈ ముక్కలువేసి సగం ఉడికీ ఉడక్క ముందే దించేయాలి. మూడు నాలుగు నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉంచొద్దు. మళ్ళీ నీళ్ళన్నీ ఒడకట్టి మిరియాల పొడి చల్లి పక్కన ఉంచేయాలి. దోసకాయల చెక్కుతీసి సన్నగా తురుముకుని చేతులతో ఒత్తి నీళ్ళన్నీ పిండేయాలి.
శెనగపిండి, ఉప్పు, ఉల్లివిత్తనాలను కొంచెం నీళ్ళతో బజ్జీల పిండిలా కలుపుకోవాలి. నురుగు వచ్చేదాకా దాన్ని గిలకొట్టి దోసగుజ్జుని దానిలో బాగా కలిపేయాలి. ఇప్పుడు మూకుడు పెట్టి నూనె వేడిచేయాలి. ఆలుముక్కల్ని ఈ పిండిలో ముంచి మీడియం సెగపెట్టి వేగించాలి. రెండు వేపులా బ్రౌన్‌రంగు వచ్చేదాకా వేగించి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి.

Updated Date - 2015-08-26T22:31:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising