ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలూ బాత్‌

ABN, First Publish Date - 2015-08-26T22:22:06+05:30

కావలసినవి బంగాళాదుంపలు: 350 గ్రాములు, బియ్యం: 1 1/2కప్పు, పెరుగు: 1 కప్పు,జీడిపప్పు 150 గ్రాములు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి : బంగాళాదుంపలు: 350 గ్రాములు,  బియ్యం: 1 1/2కప్పు , పెరుగు: 1 కప్పు, జీడిపప్పు 150 గ్రాములు, నెయ్యి: 3 టేబుల్‌ స్పూన్స్‌, పసుపు :1/4 టేబుల్‌ స్పూన్‌, ఆలు వేగించడానికి తగినంత నూనె: ఉప్పు : సరిపడినంత.
 
మసాలా పేస్టుకు: పచ్చిమిరపకాయలు: 3, ధనియాలు: 2 టేబుల్‌ స్పూన్స్‌, అల్లం ముక్క : 1, దాల్చినచెక్క : 1, పైన చల్లడానికి: ఎండుకొబ్బరి పొడి: 2 టేబుల్‌ స్పూన్లు, ధనియాల పొడి: కొద్దిగా.
 
ఎలా చేయాలి
బంగాళాదుంప చెక్కు తీసి త్రికోణాకారంలో పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి. నూనెలో వేసి బంగారు రంగొచ్చే వరకూ వేగించాలి. అందులోనే జీడిపప్పు కూడా వేసి వేగించాలి. వాటిని ప్లేట్లో విడిగా పెట్టుకోవాలి. బియ్యాన్ని బాగా కడిగి పది నిమిషాల పాటు నీళ్లలో నాన నివ్వాలి. మసాలా పేస్టు సిద్ధం చేసుకోవాలి. నెయ్యి వేడి చేసి అందులో ఆ పేస్టుని వేసి ఒక నిమిషంపాటు వేగనివ్వాలి. మంటను తగ్గించి అందులో నానబెట్టిన బియ్యం, ఇతర మసాలా దినుసులు వేసి కాసేపు వేగించాలి. తర్వాత పెరుగు కలపాలి. చివరిగా వేగించిపెట్టుకున్న బంగాళాదుంపలు, జీడిపప్పులు ఆ బియ్యంలో కలిపి తగినంత నీటిని అందులో పోసి ఉప్పును కూడా జోడించి కుక్కర్‌లో పెట్టి ఉడకనివ్వాలి. కుక్కర్‌లోంచి దించిన ఈ ఆలూబాత్‌పైన కొబ్బరి పొడి, ధనియాల పొడి జల్లి వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది.

Updated Date - 2015-08-26T22:22:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising