ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెల్లం తీపి వడలు

ABN, First Publish Date - 2015-08-30T00:01:39+05:30

కావలసిన వస్తువులు: ఒక కప్పు పొట్టుతీయని గుండు మినప్పప్పు, మంచి తెల్ల బెల్లం ఒక కప్పు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన వస్తువులు: (12 - 14 వడల కోసం)
ఒక కప్పు పొట్టుతీయని గుండు మినప్పప్పు, మంచి తెల్ల బెల్లం ఒక కప్పు, రుచికి తగినంత ఉప్పు, ఒకటిన్నర కప్పుల నీళ్లు, వడలు వేయించడానికి సరిపడా నూనె
తయారుచేసే విధానం: మినప్పప్పుని ఒక గంట సేపు నానబెట్టాలి. తర్వాత మిక్సీలో వేసి మెత్తగా వడలకు కావలసినట్లు రుబ్బుకోవాలి. సరిపడా ఉప్పు కలపాలి. ఇప్పుడు బెల్లాన్ని వెడల్పాటి పాత్రలో వేసి నీరు కలిపి సన్నని సెగపై చేతికి అంటుకునే పాకం వచ్చేవరకూ ఉంచి పక్కన బెట్టుకోవాలి. పొయ్యిమీద వెడల్పాటి మూకుడులో నూనె పోసి వేడెక్కాక మినప్పిండిని నిమ్మకాయలంత ఉండలుగా చేసుకుని అరిటాకుపై వడల్లా చేసుకుని నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించి, తీసి వెంటనే బెల్లంపాకంలో ముంచాలి. మళ్లీ వాయిలో వడలు తీసేదాకా వడల్ని బెల్లం పాకంలోనే ఉంచాలి. ఇవి వేడివేడిగా తింటే మరింత రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-08-30T00:01:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising