ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూగుపొడి పూర్ణాలు

ABN, First Publish Date - 2015-09-02T17:34:09+05:30

కావలసిన పదార్థాలు: తెల్ల నువ్వుల - పావు కిలో, బెల్లం - పావు కిలో, బియ్యం పిండి - పావు కిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: తెల్ల నువ్వుల - పావు కిలో, బెల్లం - పావు కిలో, బియ్యం పిండి - పావు కిలో, యాలకులు - 5 , ఎండు కొబ్బరి - 100గ్రా, నూనె - తగినంత
తయారీ విధానం :
ఓ బాణలిలో నూనె వేసి అందులో తెల్ల నువ్వులను వేసి దోరగా వేయించాలి. నువ్వులు చల్లారిన తరువాత మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. తరువాత బెల్లం, యాలకులను కూడా పొడి చేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరిని తురుములా చేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండిలో తగినంత నీరు పోసి కొంచెం ఉప్పు వేసి జారుడుగా కలుపుకోవాలి. అనంతరం పొడిగా చేసిపెట్టుకున్న నువ్వుల పొడి, బెల్లం, యాలకుల పొడి, కొబ్బరి తురుమును బాగా కలిపి చిన్నచిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె పోసి కాగిన తరువాత ఈ నువ్వుల ఉండలని జారుడుగా కలిపి ఉంచిన పిండిలో ముంచి నూనెలో వెయ్యాలి. దోరగా వేయించి తీస్తే సరి నూగుపొడి పూర్ణాలు సిద్ధమయినట్టే. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పిల్లలు వీటిని చాలా ఇష్టంగా తింటారు.

Updated Date - 2015-09-02T17:34:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising